ప్రముఖ నిర్మాత అరెస్ట్, నమ్మించి మోసం చేసిన నటి మహాలక్ష్మీ భర్త.
ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్న చంద్రశేఖరన్ ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వాళ్ళు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఒక పారిశ్రామిక వేత్త ను మోసం చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు ఆర్జించవచ్చని చంద్రశేఖరన్ నమ్మబలికాడు.
అయితే ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒక ప్రాజెక్టును పెట్టుబడిగా పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని రవీందర్ భావించాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను తయారు చేయించి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశాడు.
అందుకుగాను అతని వద్ద నుంచి రూ. 15.83 కోట్ల డబ్బులు తీసుకున్నాడని సమాచారం అందుతోంది. ఈ ఒప్పందం ఇప్పుడు కుదుర్చుకున్నది కాదు. గత రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు రవీందర్ చెప్పిన మాటలు నెరవేర్చడంలో విఫలమయ్యాడు.
దీంతో తన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా బాలాజీ ప్రశ్నించగా… రవీందర్ నుంచి సరైన సమాధానం రాలేదు. రవీందర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక బాలాజీ అతని మోసాలను, ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి రవీందర్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మిని వివాహం చేసుకొని ఈ జంట సోషల్ మీడియాను, ఇండస్ట్రీని హల్చల్ చేసింది.