నాడు బాలకృష్ణ, నేడు చంద్రబాబుని అరెస్ట్ చేసింది ఈ అధికారే, ఈయన ప్రత్యేకత ఏంటో తెలుసా..?

స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 2014లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని, తర్వాత నకిలీ ఒప్పందాలు, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వ ధనాన్ని డొల్ల కంపెనీలకు మళ్లించారని పేర్కొన్నారు. అనేక కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు అనంతరం చంద్రబాబు ప్రధాన నిందితుడిగా తేలడంతో ఆయనను అరెస్టు చేశామని చెప్పారు.
అయితే సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్. యాదృచ్ఛికం ఏంటంటే.. ఇది వరకు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు.. కాల్పుల కేసులో నందమూరి బాలకృష్ణను కూడా ఆయనే అరెస్టు చేశారు. ఇప్పుడు వైఎస్‌ఆర్ కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేయడం కాకతాళీయమే.
అయితే సంజయ్.. 1996 బ్యాచ్ IPS ఆఫీసర్. ఆయన ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (APCID)కి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 9న తెల్లారి 6 గంటల సమయంలో చంద్రబాబును అరెస్టు చెయ్యడంతోనే ఆయన పేరు మారుమోగింది.
ఎవరా ఆఫీసర్ అని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు రూ.371 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ తెలిపారు. ప్రస్తుతం హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ… 2004లో హైదరాబాద్‌లో కొంతమందిపై రివాల్వర్‌తో దాడి చేశారనే ఆరోపణలు వచ్చినప్పుడు..
సంజయ్.. బాలకృష్ణను అరెస్టు చెయ్యడమే కాదు.. కొన్ని కీలక ఆధారాలు సేకరించారు కూడా. అప్పట్లో సంజయ్.. హైదరాబాద్ .. వెస్ట్ జోన్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇటు చంద్రబాబు, అటు బాలకృష్ణను అరెస్టు చెయ్యడంతో.. సంజయ్ టాక్ ఆఫ్ ఏపీ అయ్యారు.