Health

పీరియడ్స్ సమయంలో ఆ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా..? భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసా..?

తీవ్రమైన నొప్పితో ఇబ్బందిపడేవారు చిన్నచిన్న చిట్కాలను పాటించటం వల్ల కాస్త నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. పీరియడ్స్ సమయంలో పుష్కలంగా నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉంది. పీరియడ్స్ వచ్చిన సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం పీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండు తినడం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది ఆడవారు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు. ఇలాంటి వాటిలో మెఫ్తాల్ ఒకటి. చాలా మంది పీరియడ్స్ నొప్పిని తగ్గించుకునేందుకు వీటినే వాడుతుంటారు.

అదికూడా డాక్టర్ ను సంప్రదించకుండా. కానీ వీటి వాడకంపై ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) డాక్టర్లు, రోగులకు డ్రగ్ సేఫ్టీ అలర్ట్ ను జారీ చేసింది. విషయం ఏంటంటే.. ఈ ట్యాబ్లెట్ లో మెఫానమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మీకు డ్రస్ సిండ్రోమ్ అనే సమస్యను కలిగిస్తుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ను ..పీరియడ్స్ నొప్పి, తిమ్మిరి, ఆర్థరైటిస్ నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి బాగా వాడుతారు. ఈ మందుల వాడకం వల్ల ఎవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డాక్టర్లు, రోగులు వెంటనే ఐపీసీ వెబ్సైట్ లో నివేదించాలని హెచ్చరించింది. అలాగే వీటిని వీటిని వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలైనా వస్తున్నాయేమోనని గమనించాలని సూచించింది.

అయితే దీనివల్ల ప్రతిఒక్కరూ ప్రభావితం అవుతారని కాదు. కానీ దీని గురించి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డ్రస్ సిండ్రోమ్ :- డ్రస్ సిండ్రోమ్ అంటే ఏంటి..డ్రేస్ సిండ్రోమ్ అంటే డ్రగ్ రాష్ విత్ ఇసినోఫిలియా, సిస్టమాటిక్ సింప్టమ్స్ సిండ్రోమ్. ఇది ఒక మందు వల్ల కలిగే అలెర్జీ. కాగా ఇది ఆ మందుకు మన రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం వల్ల వస్తుంది. అయితే ఇది హైపర్సెన్సిటివిటీ ప్రతిచర్యకు కారణమవుతుంది. దీనివల్ల మన శరీరంలోని అవయవాలు, చర్మం ప్రభావితం అవుతాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఇక ఈ డ్రస్ సిండ్రోమ్ లక్షణాలు వెంటనే కనిపించవు.

అంటే రెండు వారాల నుంచి ఎనిమిది వారాల తర్వాత కనిపిస్తాయి. ఇది దాదాపుగా 10 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. డ్రస్ సిండ్రోమ్ లక్షణాలు:- చర్మంపై దద్దుర్లు, జ్వరం, ఇసినోఫిలియా, ముఖం వాపు, మూత్రపిండాలు, కాలేయం లేదా ఇతర అవయవాల వాపు లేదా పనిచేయకపోవడం, వాపు శోషరస కణుపు. దీనికి చికిత్స ఏంటి.. మీరు ఈ సమస్య బారిన పడకూడదంటే.. డ్రెస్ సిండ్రోమ్ కు కారణమయ్యే మందులను వాడటం పూర్తిగా మానేయండి. ఇది ఈ ప్రతిచర్యను పెంచదు.

ఆ తర్వాత డ్రస్ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. దీనిలో చర్మపు దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జీర్ణశయాంతర సమస్యలు..ఈ ట్యాబ్లెట్స్ వాడకం వల్ల జీర్ణశయాంతర సమస్యలు కూడా వస్తాయి. మెఫ్టాల్ వంటి మందులను ఎక్కువ కాలంగా ఉపయోగిస్తే రక్తస్రావం, కడుపు పూతలు వంటి సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. జీర్ణశయాంతర సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇతర ఎన్ఎస్ఎఐడిలు లేదా యాంటికోయాగ్యులెంట్లను ఒకేసారి ఉపయోగించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker