Health

ఈ కాలంలో మీ కళ్లు ఎర్రగా మారుతున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలుసా..?

కళ్ళు ఎర్రబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. కంటి చికాకు, నిద్ర లేకపోవడం, కళ్లపై అధిక ఒత్తిడి వల్ల కళ్లు ఎర్రబడవచ్చు. కళ్ళు ఎర్రబడటానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. దుమ్ము, పొగ, కన్నీళ్లు రాకపోవడం, కనురెప్పలు చెడిపోవడం, కంటి చికాకు వంటివి సమస్యకు కారణమవుతాయి. అయితే చలికాలంలో కంటికి సంబంధించిన సమస్యలు రావడం చాలా సహజం. నిజానికి చలికాలంలో గాలిలో తేమ ఉండదు. దీనివల్లే చాలా మంది కళ్లు పొడిబారుతుంటాయి. అలాగే ఎర్రగా మారుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.2 బిలియన్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయి.

వీటిలో 1 బిలియన్ మందికి ఎప్పటికీ నయం చేయలేని వ్యాధులు ఉన్నాయి. కాగా కంటి సమస్యల్లో పెద్దదైన ‘దృష్టి నష్టం’ ఏ వయసు వారినైనా ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. అలాగే 50 ఏండ్లు పైబడిన వారికి ‘కంటిచూపు’ లేదా దృష్టి సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. పొడి కళ్లు..చలికాలంలో కళ్లు పొడిబారడం సర్వసాధారణ విషయం. కళ్లు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన కళ్లలో కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి కానప్పుడు కూడా కళ్లు పొడిబారుతాయి.

దీనివల్ల కంటి అసౌకర్యం కలుగుతుంది. అలాగే కళ్లు ఎర్రగా మారి దురద, చికాకు కలుగుతుంది. సీజనల్ అలెర్జీలు.. దుమ్ము, ధూళి వల్ల కళ్లలో అలెర్జీ వస్తుంది. దీనివల్ల కళ్లు దురద పెట్టడం, కంటి నుంచి నీళ్లు కారడం, ముక్కు కారడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి ఎన్నో ఇతర సమస్యలు కూడా వస్తాయి. కంటి ఇన్ఫెక్షన్లు..చలికాలంలో చల్లని, పొడి వాతావరణం వైరస్ లు లేదా బ్యాక్టీరియా వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలను పెంచుతాయి. దీనివల్ల కంటి వాపు, కళ్లు ఎర్రగా మారడం, కళ్ల నుంచి ఎప్పుడూ నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి.

ఇది కండ్లకలకకు దారితీస్తుంది. ఫోటో కెరాటిటిస్.. చలికాలంలో చాలా మంది ఎండలో ఎక్కువ సేపు కూర్చుంటుంటారు. కానీ దీనివల్ల యూవీ రేడియేషన్ కు ఎక్కువగా గురవుతారు. ఇది ఫోటో-కెరాటిటిస్ లేదా మంచు అంధత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య వల్ల కంటి నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. అంతేకాదు తాత్కాలిక దృష్టి నష్టం కూడా కలుగుతుంది. కొందరికే కళ్లు ఎక్కువగా ఎందుకు పొడిబారుతాయి.. చలికాలంలో కొందరికి కంటి సమస్యలు మరీ ఎక్కువగా వస్తుంటాయి.

అయితే డ్రై ఐ సిండ్రోమ్ తో బాధపడేవారు సంవత్సరం పొడవునా అసౌకర్య లక్షణాలతో ఇబ్బంది పడొచ్చు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చలికాలంలో కళ్లు పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. దీనివల్ల మన కళ్లలోని తేమ తగ్గుతుంది. దీంతో కళ్లు పొడిబారుతాయి.అలాగే మన కన్నీటి గ్రంథులు తగిన్ని కన్నీళ్లను ఉత్పత్తి చేయనప్పుడు లేదా మీ కళ్లలో కన్నీళ్లు తగినంత లేనప్పుడు కళ్లు పొడిబారుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker