పైల్స్ ఉన్నవాళ్లు జీవితంలో వీటి జోలికి అసలు పోకూడదు, ఎందుకంటే..?
పైల్స్..ఇది వంశపారంపరంగా వచ్చే వ్యాధి, కానీ మారుతున్న జీవనశైలిలో దీనిని ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారు. మనలో చాలామంది, కదలకుండా ఒకే చోట కూర్చొని ఎక్కువసేపు పనిచేయడం వల్ల మొలలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పైల్స్ రావటానికి ముఖ్యంగా నీరు తక్కువగా తాగడం, మద్యం ఎక్కువగా శ్రమించడం, ఫాస్ట్ ఫుడ్లు, వేపుళ్ళు మాంసాహారం ఎక్కువగా తినడం. వీటి ద్వారా మొలలు వచ్చే అవకాశం ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పైల్స్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
సుదీర్ఘమైన మలబద్ధకం, ఊబకాయం, గంటల తరబడి కూర్చోవడం లేదంటే నిలబడటం వల్ల ఈ పైల్స్ వ్యాధి వస్తుంది. మలబద్ధకం వల్ల పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఏర్పడతాయి.మలబద్ధకం వలన జీర్ణక్రియ ప్రక్రియ క్షీణించడం ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి గర్భధారణ సమయంలో స్త్రీలను ఇబ్బంది పెడుతుంది.కాగా పాయువు చుట్టూ దురద, పాయువు చుట్టూ జిగట అనుభూతి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు నొప్పి, అసౌకర్యం, రక్తస్రావం, పాయువు దగ్గర వాపులాగా రావడం అనేవి పైల్స్ వ్యాధి లక్షణాలు.
అయితే ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు తమ ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. ఫాస్ట్ ఫుడ్‌ను తినకపోవడం.. మీలో కనుక పైల్స్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే ముందుగా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్, పిజ్జాలు వంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.
వీటిని తినడం వలన జీర్ణవ్యవస్థ అనేది బలహీనపడిపోతుంది. ఫలితంగా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. వైట్ బ్రెడ్ తినకూడదు.. పైల్స్ ఉన్నవారు వైట్ బ్రెడ్ తీసుకోవడం మానేయాలి.వైట్ బ్రెడ్ తినడం వలన మలబద్ధకం సమస్య పెరుగుతుంది. శుద్ధి చేసిన పిండితో తయారుచేసిన వైట్ బ్రెడ్ జీర్ణక్రియను పాడు చేస్తుంది. టీ, కాఫీని నివారించండి.. మీరు హేమోరాయిడ్స్ లక్షణాలతో బాధపడుతుంటే, ఆహారంలో టీ, కాఫీలు తాగకూడదు.
టీ, కాఫీలు తీసుకోవడం వల్ల పైల్స్ లక్షణాలు తీవ్రమవుతాయి. హెర్బల్ టీ అయితే తాగవచ్చు. స్మోకింగ్ చేయకూడదు.. పైల్స్ ఉన్నవారు మత్తు పదార్థాలను తీసుకోవడం మానేయాలి. సిగరెట్ తాగడం , మందు తాగడం,గుట్కాలు, పాన్ పరాక్ లు నమలడం లాంటివి చేయకూడదు.