News

పూజా హెగ్డే ఇంట పెళ్లి బాజాలు. పూజా హెగ్డేకి కాబోయే భర్త ఎవరో తెలుసా..?

పూజా హెగ్డే.. కేరీర్ బిగినింగ్ లో అమ్మడు పట్టిందల్లా బంగారం అయ్యింది.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ లాక్.. వద్దన్నా వెంటపడుతున్న డిజాస్టర్స్ తో సతమతం అవుతుంది పూజా. ఈ అమ్మడు నిన్నటివరకు తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో చాలా బిజీ నటి. ఆమెకు భారీ డిమాండ్‌ కూడా ఉండేది. అయితే సినీ ఇండస్ట్రీలో తన క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను కట్టిపడేసిన అందాల భామ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.

అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఒక్కఊపు ఊపేసింది. కానీ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విశేషాలను పంచుకుంటుంది. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షర్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. పూజా హెగ్డేకి సినిమాలు లేకపోవడంతో బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే తన ప్రియుడితో దొరికిపోయింది.. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ అమ్మడి గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న పూజా హెగ్డే తన ప్రియుడితో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ అనేది ఎవరికీ పెద్దగా తెలియదు. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్, సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన ఫోటో బయటకు రావడంతో మీడియాలో వస్తున్న వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లుందని అంటున్నారు.

అంతే కాదు ఈ మధ్య పూజా హెగ్డే తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో రోహన్ కూడా కనిపించాడు..పూజాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ క్యూట్ లవర్స్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు.. అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ కూడా రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి ఫోటోలు, వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker