News

మా ఊరి పొలిమేరలో నటించిన ఈమెను గుర్తుపట్టారా..? రియల్ గా ఎలా ఉంటుందో తెలుసా..?

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్రగుప్త నిర్మించిన ఈ చిత్రానికి డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. మా ఉరి పొలిమేర ఓటీటీలో విడుదలై.. హిట్ అవడంతో.. సెకండ్ పార్ట్‌ను థియేటర్స్‌లో విడుదల చేశారు. అయితే గత ఏడాది ఈ చిత్రానికి కొనసాగింపుగా మా ఊరి పొలిమేర 2 రాగా, ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాదు.

పూర్తి స్థాయిలో హీరోగా కమర్షియల్ హిట్ అందుకున్నాడు రాజేశ్. ఈ సినిమాతో కేవలం సత్యం రాజేశ్‌కు మాత్రమే కాదు.. గెటప్ శీను, కామాక్షి భాస్కర్లకు కూడా మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే.. శ్రీను భార్య రాముల పాత్రలో నటించిన అమ్మాయి కూడా మెస్మరైజ్ చేసింది. ఫస్ట్ సీజన్‌తో పోల్చుకుంటే.. పొలిమేర 2 ఈ క్యారెక్టర్ నిడివి ఎక్కువగా ఉంది. పొలిమేర 1లో భర్తను ఎంతో ప్రేమగా చూసుకునే భార్యగా చూపించగా.

తాజాగా వచ్చిన సెకండ్ సీజన్‌లో ఆ పాత్రలో ట్విస్టులు, టర్న్‌‌లు చూసి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. మరీ ఇంతకు రాముల పాత్రలో నటించిన బ్యూటీ ఎవరంటే… సాహితి దాసరి. సోషల్ మీడియా ఇన్ప్యుయెన్సర్ నుండి నటిగా మారింది సాహితి దాసరి. పొలిమేరలో ఆమెకు వచ్చిన గుర్తింపుతో మంచి ఆఫర్లను ఒడిసి పట్టింది. ఐఐటి కృష్ణ మూర్తి చిత్రంలో చిన్న రోల్ ప్లే చేసిన దాసరి.. తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంది. పొలిమేరతో ఆమె ఫేట్ మారింది.

ఇటీవల సునీత కొడుకు హీరోగా నటించిన సర్కార్ నౌకరి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం కంచు కనకమహాలక్ష్మిలో నటిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ఉగాది సందర్భంగా పోస్టర్ విడుదల షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫోటోలతో మతి పోగొడుతుంది ఈ తెలుగు బ్యూటీ. ఆమె పిక్స్ చూస్తే.. స్టార్ హీరోయిన్ రేంజ్ మెటీరియల్ అనిపించకమానదు. మరీ ఆ పిక్స్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker