News

సర్వైకల్ క్యాన్సర్‌తో నటి పూనమ్ పాండే మృతి, ఈ క్యాన్సర్‌ గురించి ప్రతి అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయాలు.

కేవలం 32 సంవతసరాల మాత్రమే జీవించిన ఈ నటి తన ఫోటోలతో, వీడియోలతో కొన్ని నెలల పాటు సోషల్ మీడియాను ఊపేసింది. ఇక తన మరణవార్తను నటి మేనేజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ తెలుపుతూ.. పూనమ్ సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతోందని పేర్కోన్నాడు. అయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రారంభ దశలో ఒక్కోసారి ఎటువంటి సంకేతాలు కనిపించవు. నెమ్మదిగా ఈ మహమ్మారి ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుంది. పీరియడ్స్‌ సమయంలో అధికంగా రక్తస్రావం కావడం, మెనోపాజ్ తర్వాత, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం
పొత్తి కడుపులో నొప్పి రావడం,

లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు లేదా ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంట రావడం, వెజైనల్ డిశ్చార్జి దుర్వాసన రావడం, పదే పదే యూరిన్‌కి వెళ్లాల్సి రావడం, యూరిన్‌ సమయంలో నొప్పిగా అనిపించడం, కడుపుబ్బరం, అలసట, నీరసం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే. వీటిల్లో ఏవైనా లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎందుకు వస్తుంది..గర్భాశయ క్యాన్సర్ బహుళ పరిస్థితుల ఫలితంగా అభివృద్ధి చెందుతుంది. ధూమపానం చేసే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ వ్యాధి సోకిన వారు ధూమపానం చేసే వేంగా ఆరోగ్యం క్షీణఙస్తుంది.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో కూడా ఈ క్యాన్సర్‌ వస్తుంది.హెచ్‌ఐవి/ఎయిడ్స్ వంటి వ్యాధులు, రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఔషధాల ద్వారా ఈ క్యాన్సర్‌ ప్రమాదం పెరుగుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు HPV సంక్రమిచడం ద్వారా కూడా క్యాన్సర్ బారీన పడవచ్చు. ఒకే వ్యక్తి చాలా మంది లైంగిక భాగస్వాములు కలిగి ఉన్నా ఈ క్యాన్సర్‌ వస్తుంది. నోటి ద్వారా గర్భనిరోధకాలను ఎక్కువ కాలం వాడితే ప్రమాదం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ మార్గాలు.. గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన కారణం HPV ఇన్‌ఫెక్షన్‌. ప్రారంభ దశలోనే హెచ్‌పీవీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ తీసుకోవాలి.

అలాగే టీనేజర్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి ముందు ఈ టీకాలు వేయాలి. 21 ఏళ్లు దాటాక డాక్టర్ సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో పాప్ స్మియర్ టెస్టు చేయించుకోవాలి. 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకుహెచ్‌పీవీ వ్యాక్సినేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ధూమపానం మానేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తరచుగా వ్యాయామం చేయడం, మంచి ఆరోగ్యాన్ని మెయింటెన్‌ చేయడం వల్ల.. ఇన్ఫెక్షన్ల హాని తగ్గించే బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరంలో నిర్మించడంలో సహాయపడుతుంది.

కాబట్టి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దాని ప్రభావాలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మెయింటెన్‌ చేయడం, టీకాలు చేయించుకోవడం, రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడం అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker