Health

ఈ టిప్స్ పాటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్ట కొవ్వు ఐసులా కరిగిపోతుంది.

నడుముచుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా.. అందం కూడా చెడిపోతుంది. ఫలితంగా ఎక్కువమందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తద్వారా అనేక మానసిక సమస్యలకు కారణం అవుతోంది. పొట్ట చుట్టూ కొవ్వు వల్ల గుండెపోటు, మధుమేహం, కొన్నిరకాల క్యాన్సర్లు, జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి. కొంతమందిలో బరువు పెరగకుండా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుండటాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

అయితే శరీరం ఫిట్‌గా ఉంటే, అది ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. బాడీ ఫిట్‌గా ఉండటం అంటే మీ శరీరంలో అదనపు కొవ్వు ఉండకపోవడం అని అర్థం. నేటి కాలంలో, బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్యలలో ఒకటి. స్థూలకాయానికి ప్రజలు వేగంగా బలైపోతున్నారు. బరువు తగ్గడం పెద్ద సమస్య కానప్పటికీ. పొట్ట కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా కష్టపడాలి. కడుపు బయటకు వస్తే అది మీ రూపాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. అందుకే వేలాడే కొవ్వును తగ్గించుకోవడానికి వర్కవుట్ తో పాటు ఆహారంతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

అయినప్పటికీ మీ కొవ్వు తగ్గకపోతే, కొన్ని హోం రెమెడీస్ పాటించడం ద్వారా మీరు మీ పొట్ట కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాము, జీలకర్ర.. వాము, జీలకర్ర ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరమైనవి. దీనితో పాటు, ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ జీలకర్ర, వాము కలపండి. రాత్రంతా నానబెట్టండి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టండి. ఇప్పుడు గ్లాసులో వడపోసి వేడి వేడిగా తాగాలి.

దీన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల పొట్ట కొవ్వు చాలా త్వరగా తగ్గుతుంది. నిమ్మ , పసుపు.. నిమ్మ , పసుపు పొట్ట కొవ్వును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీని కోసం, సగం నిమ్మకాయ ముక్కను పిండి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి. అందులో చిటికెడు పసుపు కలపండి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వెంటనే ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క , తేనె..దాల్చిన చెక్క కొవ్వును కరగించడంలో ఎంతో మేలు చేస్తుంది. దాల్చినచెక్క , తేనె కలపి తీసుకుంటే మీ పొట్టపై నిల్వ ఉన్న కొవ్వును వేగంగా తగ్గించడంలో వేగంగా పనిచేస్తుంది.

కలబంద..అలోవెరా జ్యూస్ కూడా కొవ్వును తగ్గించడానికి సమర్థవంతమైన నివారణిగా చెప్పవచ్చు. ఇందుకోసం కలబంద రసాన్ని రోజూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని వారాల్లో కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది. వెల్లుల్లి.. వెల్లుల్లి బరువును తగ్గించడంతో పాటు, పొట్టలోని కొవ్వును తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం, క్రమం తప్పకుండా రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి, ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలపి తాగితే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker