News

ప్రభాస్ కి రహస్యంగా గిఫ్ట్ పంపిన వేణు స్వామి భార్య, వేణు స్వామి భార్య వీడియో వైరల్!

ప్రభాస్ వ్యక్తిగత జీవితం పై ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. దాంతో వేణు స్వామిని వారు పలుమార్లు ట్రోల్ చేశారు. ప్రభాస్ కి వివాహం జరగదు. సలార్ ప్లాప్ అవుతుంది. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ… వేణు స్వామి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అంటే నాకేమీ కోపం లేదు. ఆయన జాతకం ప్రకారం భవిష్యత్తు ఏమిటో చెప్పాను అంతే అన్నారు. అయితే వీణా శ్రీవాణిని సోషల్ మీడియాలో లక్షల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీణ వాయించి మరింత ఫేమస్ అయింది. ఈ మధ్య భర్త వేణు స్వామితో కలిసి రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఈ జంట సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నారు. అయితే తాజాగా వీణ శ్రీవాణి షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆమె ప్రభాస్ కోసం ఓ మధురమైన గిఫ్ట్ పంపారు. వీణ శ్రీవాణి తన ఇన్ స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో వారు పండించిన సీతాఫలాలు చూపించారు.

ఈ సీతాఫలాలు ఎవరికీ పంపుతున్నానో తెలుసా మన డార్లింగ్ ప్రభాస్ కి. ప్రతి సంవత్సరం తాము పండించిన సీతాఫలాలు కొంతమందికి పంపుతాము. అలా ఓ స్పెషల్ పర్సన్ కి ఫలాలు పంపిస్తే ఆయన దగ్గర నుంచి అవి ప్రభాస్ వద్దకు చేరాయి. ఈ క్రమంలో ప్రభాస్ కి సీతాఫలాలు బాగా నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని అడిగారని వాణి శ్రీవాణి ఆ వీడియో వెల్లడించారు. ప్రభాస్ అడిగితే ఎవరైనా పంపించకుండా ఉంటారా .. అందుకే ఈ బాస్కెట్ లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ గారి కోసం పంపిస్తున్నాను.

ఈ ఏడాదికి ఇదే చివరి పంట. మళ్లీ వచ్చే సంవత్సరం ప్రభాస్ కోసం సీతాఫలాలు పంపుతానని వీణ శ్రీవాణి అన్నారు. ఇంకా ఓ స్పెషల్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ కూడా పంపుతున్నట్లు వీణ శ్రీవాణి చెప్పుకొచ్చారు. ప్రభాస్ సీతాఫలాలు మరలా అడగడంతో ఈ రహస్యాన్ని వీణా శ్రీవాణి బయటపెట్టింది. ఈ వీడియోపై ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేణు స్వామి జాతకం పేరుతో ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. అది మా హీరో గొప్పతనం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker