Health

ఉదయాన్నే వేడిగా ఒక రాగి ముద్ద తింటే మీరు ఎంత స్ట్రాంగ్ గా అవుతారో తెలుసుకోండి.

రాగుల‌ను ముఖ్యంగా వేస‌విలో ఎక్కువ‌గా జావ రూపంలో తీసుకుంటుంటారు. అయితే వీటిని సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే తిన‌వ‌చ్చు. రాగుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో ఈ సీజ‌న్‌లో వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ర‌క్తం కూడా బాగా త‌యార‌వుతుంది. అయితే ఒకప్పుడు రాగి ముద్ద గ్రామల్లో ఎక్కువగా తినేవారు. ఇప్పుడు కాస్త తగ్గిపోయింది. ఆరోగ్యంపై దృష్టి పెరిగి.. పట్టణ ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో రాగులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాగుల్లో ఉండే ప్రత్యేక విటమిన్లు, మినరల్స్ దీనికి కారణం.

రాగుల ముద్ద ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. హెల్తీ డైట్ ఫాలో అయ్యే వారు రాగుల ముద్దను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వేడివేడి రాగుల ముద్దను వెజిటబుల్ సాంబారుతో తింటే సూపర్ ఉంటుంది. రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. బలంగా తయారు అవుతారు. ఇటీవల ఎక్కువ మంది రాగుల ముద్ద వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుని అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తీసుకుంటున్నారు. రాగుల ముద్దను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కేవలం పది పదిహేను నిమిషాల్లో చేసేయోచ్చు. రాగి ముద్ద చేయడానికి కావలసిన పదార్థాలు :- రాగుల పిండి – 2 కప్పులు, నెయ్యి – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినట్లుగా, నూనె – కొద్దిగా. ఎలా చేయాలంటే..ఒక పాత్రలో 2 కప్పుల నీరు, 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. నీరు బాగా మరిగిన తర్వాత నెమ్మదిగా కదిలిస్తూ రాగి పిండిని వేయండి. తక్కువ మంటతో నెమ్మదిగా కదిలిస్తూ ఉండండి. కానీ జాగ్రత్తగా ఉండండి, మిల్లెట్ పిండి ముద్దగా ఉండనివ్వండి.

బాగా నీరు పోస్తే.. రాగి ముద్ద తయారు అవదు. సుమారు 5 నుండి 10 నిమిషాలు కదిలించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో ఉంచండి. తర్వాత చేతిలో నెయ్యి రాసుకుని నిదానంగా మెత్తని ముద్దలా చేసుకోవాలి. రాగి ముద్ద సిద్ధం అయినట్టే. నెయ్యితో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా ఉంటాయి. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతం కలిగి ఉంటుంది. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు ఉంటుంది.

ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. గ్లూటెన్ లోపంతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. రాగుల్లోని కాల్షియం ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువగా సాయపడుతుంది. శరీరం వేడి ఉన్నవారికి కూడా ఇది బాగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కూడా రాగిని ట్రై చేయోచ్చు. ఇంకెందుకు ఆలస్యం ప్రతి రోజూ రాగి ముద్దను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker