Health

ఈ వంటనూనెలు వాడుతున్నారా..? మీ ఆయుష్షు భారీగా తగ్గిపోతుంది.

వంటలు వండేటప్పుడు నూనె వాడకం తగ్గించాలి. దీని వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగినట్టు అవుతుంది. అది ఎలాగంటే . వేపుళ్లకు బదులు తాలింపు, బేకింగ్ , గ్రిల్లింగ్, స్ట్రీమింగ్ కు ప్రాధాన్యత ఇవ్వండి.. దీంతో ఏ, డి, కె, విటమిన్లు మన శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఫ్రైడ్ స్నాక్స్ కు బదులు రోస్ట్ చేసిన, లేదా స్ట్రీమ్ చేసిన స్నాక్స్ ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మంచి వంటనూనె అయినా సరే, ఎంత తక్కువగా అంత మంచిది అని చెబుతారు వైద్యులు. నూనె, ఉప్పు… ఈ రెండు మన ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. మార్కెట్లో ఎన్నో రకాల వంటనూనెలు ఉన్నాయి.

ఒక్కక్కరూ ఒక్కోరకం నూనెను ఎంచుకుంటారు. కొన్ని రకాల వంట నూనెలు వాడడం వల్ల మనకు తెలియకుండా శరీరం నీరసించి పోతుంది. పామాయిల్.. గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ పామాయిల్ వాడుతూ ఉంటారు. అలాగే రోడ్డు పక్కన బజ్జీలు, బోండాలు అమ్మేవాళ్లు కూడా పామాయిల్ వినియోగిస్తారు. ఈ నూనెలో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, వీటిని అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి. అంతేకాకుండా, పామాయిల్ ఉత్పత్తి అనేది పర్యావరణానికి కూడా హాని కలిగించేది. పామాయిల్ వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్యం లభించదు.

మొక్కజొన్న నూనె..కార్న్ ఆయిల్ ను వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇది వెజిటబుల్ ఆయిల్స్ జాబితాలోకి వస్తుంది. ఈ నూనెలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఆహారంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్‌కు దారి తీస్తుంది. ఈ పరిస్థితి అనేక జబ్బులకు ఆహ్వానం పలికినట్టే. శరీరలో చేరిన ఒమేగా -6 ఫ్యాటీ ఆమ్లాలను సమతుల్యం చేయడానికి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని బదులు కార్న్ ఆయిల్ వాడకాన్ని తగ్గించుకోవడం ఉత్తమం.

సోయా ఆయిల్..ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోయాబీన్ నూనె ఒకటి. దీనిలో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందుకే సోయాబీన్స్ తో చేసిన నూనెను చాలా తక్కువగా వినియోగించాలి. సోయా బీన్స్ తీవ్రంగా ప్రాసెస్ చేశాకే ఈ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తారు. ప్రాసెస్డ్ ఆయిల్ వాడడం మంచిది కాదు. సోయా ఉత్పత్తులు మంచివే అయినా… ప్రాసెస్ చేయని సోయా ఉత్పత్తులను ఎంచుకోవడమే ఉత్తమం. కనోలా ఆయిల్..కనోలా ఆయిల్ ఉత్తర భారతదేశంలో అధికంగా వినియోగిస్తారు. ఇది దాదాపు ఆవనూనెలాగే ఉంటుంది. దీన్ని వెజిటబుల్ ఆయిల్స్ లో ఒకటిగా చెబుతారు.

కనోలా నూనె తక్కువగా వాడితే ఆరోగ్యకరమే కానీ అధికంగా వాడితే మాత్రం ఆరోగ్యానికి నష్టం. కనోలా మొక్కల్లో కొన్ని జన్యుపరంగా మార్పులకు గురవుతాయి. అలాంటి పంటల నుంచి సేకరించిన గింజలతో ఆయిల్ తయారు చేస్తే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి రోజు వారీ వంటలకు కనోలా ఆయిల్ వాడకపోవడమే మంచిది. ఆలివ్ ఆయిల్..ఆలివ్ ఆయిల్ రోజుకు రెండు మూడు స్పూన్ల వరకు వాడడం మంచిదే. వాటితో ఏకంగా కూరలు, బిర్యానీలు వండుకుని తినడం మానేయాలి. సలాడ్లపై చల్లుకుని తినడం వరకు ఫర్వాలేదు.

కానీ ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో మాత్రం ఆలివ్ ఆయిల్ తీసుకోకూడదు. ఇతర నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ తక్కువ స్మోక్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. అంటే ఇది అధిక వేడి మీద వండే వంటకు సరైన ఎంపిక కాదు. ఎక్కువ మంట మీద ఈ నూనెను వండితే పోషక విలువలు నశిస్తాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన సమ్మేళనాలు విడుదలవుతాయి. ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. కాబట్టి ఆలివ్ ఆయిత్ కూరలు వండుకోవడం మానేయాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker