News

రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లి సందడి, మనోడి బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉందంటే..?

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాహుల్ పాడిన నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. మరో అరుదైన విషయం ఏమిటంటే… రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పాడారు. అది కొద్దిమందికి మాత్రమే దక్కే అవకాశం. ఈ పరిణామం రాహుల్ సిప్లిగంజ్ మరింత పాప్యులర్ చేసింది.

రాహుల్ సిప్లిగంజ్ కెరీర్లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పేందుకు ఓ వేడుక కారణమైంది. అయితే రాహుల్ సింప్లిగంజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈపేరు తెలియనివారుండరు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.

యూట్యూబ్ వీడియోస్ నుంచి మొదలైన రాహుల్ ప్రయాణం ప్రపంచప్రఖ్యత ఆస్కార్ వేదిక వరకు చేరింది. తన గాత్రంతో యావత్ దేశ ప్రజలనే కాదు.. ప్రపంచాన్ని మైమరపించాడు. ఎప్పుడూ తన పాటలతో అలరించే రాహుల్.. ఇప్పుడు నటుడిగానూ మెప్పించాడు. ఇటీవల విడుదలైన రంగమార్తండ సినిమాలో రాహుల్ నటనకు ప్రశంసలు అందుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. రాహుల్ సిప్లిగంజ్ వివాహా వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీప్రముఖులు.. రాజకీయ నాయకులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాహుల్ దగ్గరుండి తమ్ముడి పెళ్లి పనులు చూసుకున్నారు.

పెళ్లికి సంబంధించిన ఫోటోలను రాహుల్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker