Rain Alert: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ. వచ్చే 5 రోజులు ఈ జిలాల్లో భారీ వర్షాలు.

Rain Alert: వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడరాదు. విద్యుత్ స్తంభాలకు, వైర్లకు దూరంగా ఉండాలి. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అని విశాఖ వాతావరణ శాఖ అధికారి ఎస్.వి జగన్నాథ కుమార్ అన్నారు.

దక్షిణ ఒరిస్సా, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాన పరుగు ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది అని తెలిపారు. అది దక్షిణ వైపు వంగి ఉంది అని తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే (ఐఎండీ) తెలిపింది.
Also Read: విశాల్-సాయి ధన్సికల పెళ్లి వాయిదా..!
ఈ ఆవర్తనం కారణంగా మొదటి రెండు రోజులు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, వెస్ట్ గోదావరి, యానం, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు పడతాయి అని తెలిపారు.
Also Read: 96 కేజీలు ఉండే ఈ హీరోయిన్.
దీని ప్రభావంతో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో కూడా అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు పడతాయి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన గాలులు వేస్తాయన్నారు. సముద్రం తీరప్రాంతాలలో ఉధృతమైన ఈదురు గాలులు వేస్తాయని మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని సూచించామని తెలిపారు.