రజినికాంత్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందొ చుడండి.
రజినీకాంత్ చలనచిత్ర రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది. ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా సినిమాలను లైనప్ చేసి బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 70 పైనే అయినా కూడా ఆయన యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు.
మొన్నీమధ్య జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు తలైవ. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఏకంగా 700 కోట్లవరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆతర్వాత లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫొటోలో రజినీకాంత్ ఎత్తుకున్న ఆ అమ్మాయి ఓ స్టార్ సింగర్.. నేపధ్య గాయని నుంచి స్టార్ సింగర్ గా ఎదిగింది.
ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించింది ఆమె. నాలుగు వేలకు పైగా పాటలను ఆలపించి అలరించింది. ఎన్నో చక్కటి పాటలతో ఆకట్టుకుంది ఆమె. ఆమె సింగర్ అనురాధ శ్రీరామ్. అనురాధ శ్రీరామ్ తల్లి ప్లేబ్యాక్ సింగర్.. దాంతో ఆమె అనురాధ శ్రీరామ్ కూడా సంగీతం నేర్పించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ముంబయి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనురాధ. ఆతర్వాత చాలా సినిమాలకు పాడారు.
ఇక తెలుగులో సొగసు చూడతరమా అనే సినిమాలో పాటలు ఆలపించారు. ఆ సినిమాలో సీతాకోక చిలకమ్మా అనే పాటను ఆలపించారు. అనురాధ వాయిస్‌లో స్పెషల్ బేస్ ఉంటుంది ఎంతటి కష్టతరమైన పాటనైనా ఆమె అవలీలగా ఆలపించగలరు. తెలుగులో అనురాధ శ్రీరామ్ ఎన్నో అద్భుతమైన పాటలను అలరించారు. దాదాపు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో అనురాధ పని చేశారు.