News

కష్టాన్ని ఇష్టంగా పడుతూ.. పిల్లల్ని స్కూల్‌కు ట్రైసైకిల్‌లో తీసుకెళ్తున్న తండ్రి. హృదయాన్ని కదిలిస్తున్న వీడియో.

తల్లి తన ప్రేమను బిడ్డపై కురిపిస్తే.. తన పిల్లలకు కష్టం దరి చేరకుండా కావాలా కాసే తండ్రి పిల్లలకు పైకప్పు లాంటివాడు. పిల్లల జీవితం సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు తమ జీవితాన్నే త్యాగం చేస్తారు. పిల్లలు ఎంత చేసినా ఎన్ని చేసినా తల్లిదండ్రుల ఋణం ఎన్నడూ తీర్చుకోలేనిది. అయితే వారికి పిల్లలు ప్రేమ, ఆనందాన్ని ఇవ్వగలరు.

అయితే ఒక తండ్రి తన పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్ళగలడు. తన పిల్లల కోసం ఏమైనా చేయగలడు అనే విషయం మనందరికీ తెలుసు. లోకంలో ఏ కష్టాలు వచ్చినా తన పిల్లలకు తండ్రి రక్షణ కవచంలా నిలుస్తాడు. తన పిల్లలకు కష్టం దరి చేరకుండా కావాలా కావాలా కాస్తాడు. అందుకే పిల్లల జీవితంలో నాన్న ఓ నమ్మకం… ఓ రియల్ హీరో.. నాన్న అంటే గర్వం.. నాన్న జీవించి ఉండగా పిల్లలకు ఎటువంటి హాని కలగదు.

అందుకు సజీవ సాక్ష్యం ఈ వీడియో .. ట్విట్టర్ లో కనిపిస్తున్న ఈ వీడియో చూపరుల కంట కన్నీరు పెట్టిస్తోంది. వీడియోలో వికలాంగుడైన తండ్రి తన పిల్లలను వీల్ చైర్‌లో తీసుకుని వెళ్లి పాఠశాలలో దింపుతున్నాడు. తండ్రి తన ట్రైసైకిల్‌పై ముందు, వెనుక సీట్లలో పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాడు.

ఒక పిల్లవాడు తన తండ్రి ఒడిలో ముందు కూర్చుని, మరొక పిల్లవాడు వెనుక కూర్చున్నాడు. ట్రాఫిక్ మధ్యలో తన చేతులతో ట్రైసైకిల్ నడుపుతూ వారిని పాఠశాలకు తీసుకెళుతున్నాడు. ఎవ్వరినైనా భావోద్వేగానికి గురి చేసేలా ఈ వీడియో ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker