శరత్ బాబు రమాప్రభ విడిపోవడానికి కారణం ఇదే, ఆ రోజుల్లోనే..?
సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలోనే ప్రముఖ లేడీ కమెడియన్ రమాప్రభతో శరత్ బాబు ప్రేమాయణం కొనసాగించి, పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. వాస్తవానికి శరత్ బాబును చూడగానే ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడిపోతుంది. అలాగే అప్పటికే సినిమా రంగంలో సెటిల్ అయినా రామాప్రభ కూడా శరత్ బాబును ప్రేమించింది. అయితే శరత్ బాబు ఆరడుగుల అందగాడు. అరవింద దళాయాతాక్షడు. స్పుర ద్రూపి. అన్నింటికి మించి ముట్టుకుంటే మాసి పోయే అందం. ఇది శరత్ బాబు గురించి కొన్ని విషయాలు.
ఈయన అడుగుపెట్టే సమయానికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా చెలమణి అవతున్నారు. వాళ్ల కంటే గ్లామరస్‌గా ఉన్న.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే పరిమితమయ్యాడు. తెలుగు నుంచి ప్యాన్ ఇండియా నటుడిగా వివిధ భాషల్లో సత్తా చూపిన నటుల్లో శరత్ బాబు ఒకరు. రమాప్రభ.. శరత్ బాబు కంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్. రమా ప్రభ తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్‌గా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెేవలం కామెడీ పాత్రలతో నే కాదు ఎమోషనల్ పాత్రల్లో నటించిన మెప్పించిన ఘనత రమాప్రభ సొంతం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి ఎన్టీఆర్ నుంచి జూ ఎన్టీఆర్ వరకు దాదాపు నాలుగు తరాల హీరోలతో నటించిన ట్రాక్ రికార్డు రమా ప్రభ సొంతం. పాత్ర ఎలాంటి దైనా తన దైనశైలిలో రక్తి కట్టించి మెప్పించడం రమాప్రభ సొంతం. ఆమె సినిమాల్లో ఉందంటే.. కామెడీకి లోటు ఉండదు. ఇక రాజబాబుతో ఈమె కెమిస్ట్రీకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత పద్మనాభం, సుత్తివేలు తదితరులతో నటించినా.. వెండితెరపై రాజబాబుతో ఈమె కెమిస్ట్రీ అదుర్స్ అనే చెప్పాలి. రమాప్రభ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచారు. ఇక వీళ్లిద్దరు తమకు సంబంధించిన ఓ వ్యక్తి ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. వీళ్లిద్దరు జంటగా కొన్ని సినిమాల్లో నటించారు కూడా. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీళ్లిద్దరు 1974లో ఇరు కుటుంబ సభ్యుల పెద్దల అంగీకారంతో వివాహాం చేసుకున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీళ్ల సంసారం ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. వీళ్లు విడిపోవడానికి అసలు కారణమేమిటో వీళ్లిద్దరు ఇప్పటికీ సరైన వివరణ లేదు. మధ్యలో రమాప్రభ తన డబ్బు, సినిమాల్లో అవకాశాల కోసమే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పడం గమనార్హం. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు ఒకరి అభిప్రాయాలు.. వేరకరితో కలవని కారణంగా విడిపోయారు.
పెళ్లై 14 యేళ్ల తర్వాత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత శరత్ బాబు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ రమాప్రభ మాత్రం సింగిల్‌గా ఉండిపోయింది. ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో విజయ చాముండేశ్వరిని దత్తత తీసుకున్నారు.ఈమెకు ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేసారు రమాప్రభ. ఇక రమాప్రభ.. శరత్ బాబు సినిమాల్లో అవకాశాల కోసమే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలు చేసారు. కానీ శరత్ బాబు హీరోగా సక్సెస్ కాకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. ఇక రమాప్రభ సినిమాల్లో రాకముందు తమిళ నాటక రంగంలో నాలుగు వేలకు పైగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.
కానీ పెళ్లి అనే నిజ రంగస్థలంలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రమాప్రభకు చదువు అంతంతమాత్రంగానే చదువుకుంది. ఈమె తెలుగ సినీ పరిశ్రమలో గొప్పనటిగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో పుట్టిన రమాప్రభ.. సినిమాలపై మమకారంతో మద్రాసు వెళ్లి నటిగా ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు రమాప్రభ చేస్తేనే వాటికి న్యాయం చేకూరుతుంది. ఏది ఏమైనా శరత్ బాబుతో ఈమె వివాహా బంధం మాత్రం పెటాకులు కావడం విషాదకరం. శరత్ బాబు, రమాప్రభల వైవాహ జీవితం ఒడిదొడుకులతో సాగింది.
నటి రమప్రభను 1974లో పెళ్లాడారు. 14 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత 1990లో తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను పెళ్లాడారు. ఈమెకు 2011లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరో అమ్మాయితో డేటింగ్ గట్రా నడిపినా.. అది పెళ్లి దారితీయలేదు. ఏది ఏమైనా సినీ రంగంలో తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నశరత్ బాబు వైవాహిక జీవితం అంత సాఫిగా సాగలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఈయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిద్ధాం.