News

రష్మీకి ఘోర అవమానం, యాంకర్ ముఖం మీద షూ వేసిన కమెడియన్, వైరల్ వీడియో.

యాంకర్ రష్మీ ఈ పేరుకు యూత్​లో ఫుల్ క్రేజ్​ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామకు మొదట సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్​పై యాంకర్​గా అవతారం ఎత్తింది. జబర్థస్త్ షో అయితే ఆమె జాతకాన్ని మార్చేసింది. బుల్లితెర ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీని తీసుకొచ్చింది. అయితే తాజాగా టిల్లు స్క్వేర్ మూవీ స్పూఫ్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్.

ఈ క్రమంలో ఇమ్మానుయేల్ టీం లోని ఓ కమెడియన్ రష్మీ ని ఇన్సల్ట్ చేశాడు. ఈ స్కిట్ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలను కలిపి చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్మానియేల్, మరో కమెడియన్ టిల్లు గా యాక్ట్ చేశారు. సదరు కమెడియన్ టిల్లు స్క్వేర్ మూవీలో హీరో హీరోయిన్ ని ఫ్లర్ట్ చేసినట్లే రష్మీ ని ఫ్లర్ట్ చేసాడు. రష్మీని ఉద్దేశిస్తూ… ‘ఎక్కడో మనుసు విరిగినట్టుంది… ఉన్నాడా బాయ్ ఫ్రెండ్’ అంటాడు.సమాధానంగా రష్మీ… నీకెందుకు అని మండిపడింది.

దీనికి కమెడియన్ అదిరిపోయే పంచ్ వేశాడు. ‘ఆ ఏం లేదు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నా షూ నేను వేసుకుని వెళ్ళిపోతా .. లేదంటే ఈ షూ నీ మీద వేసి పోతా’ అని షూ విసురుతాడు. దాంతో రష్మీకి ఏం చెప్పాలో తెలియక నోరు వెళ్ళబెట్టింది. చూస్తూ షాక్ లో ఉండిపోయింది. సదరు కమెడియన్ ఇలా చెప్పడం హైలెట్ గా నిలిచింది. వర్ష రాధిక పాత్రలో కనిపించింది. లిల్లీ గా మరో లేడీ కమెడియన్ చేసింది.

అయితే ఇదంతా ఫన్ లో భాగమే. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా నవ్వులు పూయించే విధంగా ఉంది. ఇందులో ఇమ్మానుయేల్ స్కిట్ హైలెట్ గా నిలిచింది. ఆటో రాంప్రసాద్ రోహిణి తో కలిసి కామెడీ పండించాడు. బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్ తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. కాగా ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker