నగ్మా ఎంత మందితో ఎఫైర్స్ నడిపించిందో తెలుసా..?

90 వ దశకంలో ప్రముఖ బాలీవుడ్ హీరోలైన సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్ మరియు కరిష్మా కపూర్ వంటి నటీమణులతోనూ ఆమె కలిసి నటించారు. నగ్మా అసలు పేరు నందితా మోరార్జీ. ఆమె తల్లి ఒక ముస్లిం వనిత, 1972 లో ఆమె అర్వింద్ మోరార్జీని పెళ్లి చేసుకున్నారు. ఆమె తండ్రి అర్వింద్ మోరార్జీ దేశంలోనే ప్రముఖ వస్త్ర వ్యాపారి. అయితే అలనాటి సినీ తార 90లలో కుర్రకారును నిద్ర లేకుండా చేసిన భామ ఎవరైనా ఉన్నారంటే ఆమె నగ్మా అనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ నాయకురాలు రాణిస్తున్నారు. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది నగ్మా.
ఈమె తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రహీరోలతో పాటు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లతో ఎ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అటు సినిమాల పరంగా.. ఇటు రాజకీయాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది నగ్మా. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిగ్గే. ఆమె నలుగురు పెళ్లైన వాళ్లతో ప్రేమాయణం నడిపిందంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు, ఒక క్రికెటర్ ఉండటం విశేషం. నగ్మా 1974లో ముస్లిం మరియు హిందూ కుటుంబంలో జన్మించింది.
ఆమె తల్లి ముస్లిం మరియు తండ్రి హిందూ కుటుంబాలకి చెందిన వారు. తండ్రి జైసల్మేర్ రాజ కుటుంబానికి చెందినవారు. ఆ తర్వాత గుజరాత్‌కు, ముంబైకి మకాం మార్చింది నగ్మా కుటుంబం. నగ్మా టాలీవుడ్ సినిమాలతో పాటు హిందీ, బోజ్ పురీ చిత్రాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళంలో అప్పట్లో ఈమెకు అభిమానులు గుడి కూడా కట్టారు. నగ్మా వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. మీడియా రిపోర్టుల ప్రకారం నగ్మా.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఘాటు ప్రేమాయణం నడిపింది.తిరుపతిలో ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయ్. అయితే, ఆ తర్వాత గంగూలీ భార్య డోనా జోక్యంతో వీరిద్దరి బంధంకు ఎండ్ కాండ్ పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అప్పట్లో గంగూలీ ఏదైనా పేలవ ప్రదర్శన చేసినప్పుడు నగ్మాను టార్గెట్ చేసుకుని వార్తలు వచ్చాయ్. ఫ్యాన్స్ కూడా ఆమెను తప్పుబట్టారు. ఆ తర్వాత వీరిద్దరి విడిపోయి ఎవరి జీవితాల్లో వారు ముందుకెళ్లారు. సౌరవ్ గంగూలీతో విడిపోయిన తర్వాత.. నగ్మా రాధిక ప్రస్తుత భర్త శరత్ కుమార్ తో ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయ్. రాధికా కూడా శరత్ కుమార్ కి రెండో భార్య అన్న విషయం తెలిసిందే. అయితే, నగ్మా తో ప్రేమాయణం విషయం తెలుసుకున్న శరత్ కుమార్ మొదటి భార్య ఆ తర్వాత శరత్‌కు మార్‌కు విడాకులు ఇచ్చింది. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. నగ్మా.. శరత్ కుమార్ తో బ్రేకప్ చెప్పేసింది. సౌత్, హిందీ సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత నగ్మా.. భోజ్‌పురి చిత్రాలపై ఫోకస్ పెట్టింది.
అక్కడ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. బోజ్ పురి సూపర్ స్టార్ రవి కిషన్‌తో చాలా చిత్రాలలో యాక్ట్ చేసింది నగ్మా. ఈ జంట కెమీస్ట్రీ కూడా అక్కడ ఫ్యాన్స్ బాగా ఇష్టపడేవారు. ఆ తరువాత రీల్ రిలేషన్ షిప్ కాస్తా రియల్ గా మారింది. వీరిద్దరి ప్రేమాయణంపై బోజ్ పురి మీడియా కోడై కూసింది. ఆ తర్వాత నగ్మా.. తనకు మధ్య సంబంధం గురించి తన ఇంట్లోకి వారికి తెలుసు అని రవికిషన్ అప్పట్లో ప్రకటించడం విశేషం. ఆ తరువాత, వారి ప్రేమ గురించి మీడియాలో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.
నటుడు తన మరియు నగ్మా మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తనకు, నగ్మాకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఇంట్లోని వారందరికీ తెలుసునని ఆయన అన్నారు. అతని భార్య ప్రీతి కూడా నగ్మాను బెస్ట్ ఫ్రెండ్ గా భావించింది. అయితే, వీరి గురించి తెలిసిన వెంటనే భార్య ప్రీతి రవి కిషన్ తో గొడవ పడిందట. దీంతో, నగ్మాకు బ్రేకప్ చెప్పెసాడు రవికిషన్. రవి కిషన్‌తో విడిపోయిన తర్వాత, నగ్మా మరో బోజ్ పురి నటుడు మనోజ్ తివారీతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయ్. అప్పట్లో మనోజ్, రవికిషన్ మధ్య ఇండస్ట్రీలో పెద్ద పోటీ ఉండేది.
అయితే, మనోజ్ మరియు నగ్మా ఇద్దరూ తమ ఎఫైర్ వార్తలను బహిరంగగానే ఖండించారు. దీని గురించి నటి ఒకసారి మాట్లాడుతూ, ‘మేమిద్దరం కలిసి పని చేస్తున్నామంటే, మా మధ్య ఏదైనా జరుగుతున్నట్లు అర్థం కాదు ” అని తెలిపిందే. ఈ వార్తలు వచ్చినప్పుడు మనోజ్ తివారీ మరియు రవి కిషన్ ఇద్దరూ వివాహితులే. వీళ్లిద్దరు ప్రస్తుతం లోక్‌సభ సభ్యులు కావడం విశేషం. ఇక నగ్మా కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే కదా. ఈమె యూపీలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది.