మందుబాబులకు అద్దిరిపోయే శుభవార్త, వైన్ తాగితే గుండె జబ్బులు రావట..!

వైన్ గుండె కణాలను.. కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మీ కరోనరీ ధమనులను కూడా ఇది రిలాక్స్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా రెస్వెరాట్రాల్, ఎల్‌డిఎల్, “చెడు” కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అయితే సాధారణంగా వైన్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. ఇందులో ఆల్కాహాల్ శాతం తక్కువగా ఉండడం.. స్వీట్‌గా ఉండడంతో.. వైన్‌ను ఎక్కువ మంది తాగుతుంటారు.
అంతేకాదు వైన్ తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఇటీవలి పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ ఒక పెగ్ వైన్ తాగడం వల్ల శరీరం పూర్తిగా శుభ్రపడుతుంది. శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయట. రెడ్ వైన్‌లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది వివిధ రకాల అలెర్జీ, క్యాన్సర్, వైరల్ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తాయి. రెడ్ వైన్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. వైన్ పంటి ఎనామిల్‌ను సైతం గట్టిపరుస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు.
ఒక పెగ్ రెడ్ వైన్ మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది. రెడ్ వైన్ గుండె ధమనులలో కొవ్వు నిల్వలను నిరోధించే రెస్వెరాట్రాల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతిరోజూ రెడ్ వైన్ తక్కువ మొత్తంలో తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. శ్వాస సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వైన్ చర్మ ఆరోగ్యానికి కూడా చక్కగా పనిచేస్తుంది. ముడతలను తగ్గించి.. ఎల్లప్పుడు యవ్వనంగా ఉండేలా చూస్తుంది.