Health

మీ శరీరంలోని ఈ భాగాన్ని ఎప్పుడు క్లీన్‌గా ఉంచితే చాలు, మీరు ఎప్పుడు నిత్యయవ్వనంగా ఉంటారు.

వృద్ధాప్య లక్షణాలు కొందరి ముఖంలో చాలా కాలం వరకు కనిపించవు. దీనికి కారణం వారి శరీరంలో కొల్లాజెన్ అధికంగా ఉత్పత్తి కావడమే అని చెప్పవచ్చు. మీరు కూడా మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మీ వయసు పెరుగుతోందా… ముసలితనపు లక్షణాలు వస్తున్నాయా… ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయా… పని చేస్తున్నప్పుడు నీరసం వచ్చేస్తోందా… ఇలాంటి సమయంలో మీ మనసులో బాధ మొదలవుతుంది. ముసలితనం వచ్చేస్తోంది అనే ఆలోచన మిమ్మల్ని కుంగదీస్తూ ఉంటుంది. కానీ ఈ సమస్య నుంచి మీరు… ఈజీగా బయటపడవచ్చు.

అంతా చిన్న చిట్కాపై ఆధారపడి ఉంది. మీ నాలికే మిమ్మల్ని తిరిగి యంగ్‌గా చెయ్యగలదు. అదెలాగో మీకు అర్థం కాదు. కానీ పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. డేటా ప్రకారం… నోటిలోపల… సరిపడా బ్యాక్టీరియా తయారైనప్పుడు… మీ వయసుతో సంబంధం లేకుండా మీరు యంగ్‌గా కనిపిస్తారు. తరచూ మీరు మీ నాలికను శుభ్రం చేసుకుంటూ ఉంటే… కొత్తగా మళ్లీ బ్యాక్టీరియా పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా నైట్రిక్ యాసిడ్‌ని ఉత్పత్తి చేస్తుంది. అది నోటిలోని లాలాజలంలో కలుస్తుంది. అది వయసును పెరగనివ్వకుండా అడ్డుకుంటోంది.

మరి ఈ నైట్రిక్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే ఏం చెయ్యాలి? పరిశోధనలో ఈ విషయం తేలింది. మీరు మీ నాలికను గీసినప్పుడు, పాచిని తీసేసినప్పుడు… అక్కడ ఉండే చెడు పదార్థాలు, అతుక్కుపోయిన వ్యర్థాలూ బయటకు వచ్చేస్తాయి. దాంతో… ఆ ప్రాంతం పరిశుభ్రమై… మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు వీలుగా మారుతుంది. నాలిక ద్వారా 50 శాతం నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది అని టెక్సాస్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ చెబుతోంది. ముసలితనం త్వరగా రాకుండా చెయ్యడంలో నాలిక కీలక పాత్ర పోషిస్తోందని తేల్చారు. మనం బ్రష్ చేసుకున్నప్పుడు బ్రష్.. నాలికపై ఉన్న వ్యర్థాలను పోగొట్టలేదు.

దానికి టంగ్ క్లీనర్ వాడాల్సిందే. వీలైనంత ఎక్కువగా నాలికను లోతుగా శుభ్రం చేసుకోమని సూచిస్తున్నారు. ఐతే… టంగ్ క్లీనర్ గొంతులోకి వెళ్లిపోకుండా జాగ్రత్త పడాలి. ఇంతకీ నైట్రిక్ యాసిడ్ వయసును ఎలా తగ్గించగలదు? మన వయసు పెరిగే కొద్దీ… మన శరీరంలోని క్రోమోజోమ్‌లో దిగువ భాగం సరిగా పనిచేయదు. ఫలితంగా DNA సరిగా పనిచేయదు. కణంలోని మైటోకాండ్రియా పనితీరు, సామర్థ్యం దెబ్బతింటాయి. స్టెమ్ సెల్స్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోయి… ఏవైనా గాయాలు అయితే… శరీరం వెంటనే వాటిని నయం చెయ్యలేదు.

ఈ పరిస్థితి రాకుండా నైట్రిక్ యాసిడ్ మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. నోటిపై ఉండే బ్యాక్టీరియా సృష్టించే నైట్రేట్స్… ఉమ్మి (లాలాజలం) ద్వారా పొట్టలోకి వెళ్లి నైట్రిక్ యాసిడ్ అవుతుంది. ఈ యాసిడ్డే… కణాన్ని ముసలిదానిలా అవ్వకుండా చేస్తుంది. దాంతో వయసు పెరగదని సైంటిస్టులు తేల్చారు. సో… మొత్తానికి వయసు పెరగకుండా ఉంచే ఛాన్స్ నాలికకు ఉందని అర్థమైంది. ఇక ఇప్పుడు మనం నాలికను శుభ్రంగా ఉంచుకుంటే… చాలా మేలు అన్న విషయం బయటపడింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker