News

రోడ్డు ప్రమాదంలో అస్సాం ‘లేడీ సింగం’ దుర్మరణం.

అస్సాంలోని నాగావ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఆమె వాహనం ఒక కంపార్ట్‌మెంట్ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె మరణాన్ని ‘మిస్టరీ’గా అభివర్ణించారు. ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు.

తెల్లవారుజామున 2:30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసు పెట్రోలింగ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. పూర్తీ వివరాలలోకి వెళ్తే అస్సాంలోని లేడి సింగంగా గుర్తింపు తెచ్చుకున్ మహిళా పోలీస్ అధికారు జున్‌మోనీ రాభా మృతి చెందారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఆమె రోడ్డ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

మోరికొలాంగ్ పోలీస్ ఔట్‌పోస్టు ఇంఛార్జిగా పనిచేస్తున్న ఎస్ఐ జున్‌మోనీ రాభా.. సోమవారం అర్ధరాత్రి తన ప్రైవేటు కారులో ప్రయాణిస్తున్నారు. 2.30 AM గంటలకు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఓ కంటైనర్ జఖలబంధా స్టేషన్ పరిధిలోని సురభుగియా గ్రామంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆమె సివిల్ దూస్తుల్లో ఉందని.. అయితే అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా అస్సాం నాగాన్‌ జిల్లాలో జున్‌మోనీ రాభా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు.

విధుల్లో కఠినంగా వ్యవహరించే ఆమె.. తన పనితీరుతో ఆ ప్రాంతంలో ‘లేడీ సింగం’, ‘దబాంగ్‌ పోలీస్‌’గా పేరు మంతి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే ఆమె పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలపై కూడా గతేడాది జూన్‌లో ఆమె అరెస్టయ్యారు. కొంతకాలం పాటు సస్పెన్షన్‌లో ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి ఆమె విధుల్లో చేరారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker