విదేశీ ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న రోజా కూతురు, వైరల్ అవుతోన్న పిక్స్.
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే రోజా ఎప్పటికప్పుడు తన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను మాత్రం షేర్ చేయడం చాలా అరుదు. అయితే టాలీవుడ్‌లో నటిగా పాపులర్ అయిన రోజా.. ఇప్పుడు రాజకీయాల్లోను సత్తా చాటుతున్నారు.
ఏపీ మంత్రిగా పదవిస్వీకారం చేసాకా జబర్దస్త్ కు కూడా మానేసిన ఆమె పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు తెలిపారు. రోజా-సెల్వమణి దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఆమె కూతురు పేరు అన్షు మాళిక. రోజా కూతురు అన్షు మాళిక కూడా మంచి అందగత్తే.
అయితే అన్షును హీరోయిన్’గా రోజా పరిచయం చేయనున్నట్లు వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరో కొడుకు సినిమాతో అన్షు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్‌తో రోజా కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది.
చూడాలి మరి ఈ వార్తలో నిజం ఎంతో.. ఇక అది అలా ఉంటే రోజా కూతురు అన్షు తాజాగా కొన్ని ఫోటోలను తనసోషల్ మీడియాలో పంచుకుంది. తన విదేశీ ఫ్రెండ్స్‌తో పరిసరాలను క్లీన్ చేస్తోన్న కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.