Health

ఈ చిన్న చిన్న జాగర్తలతో కరోనా రాకుండా మీ పిల్లల్ని కాపాడుకోవచ్చు.

భారత్, చైనా, యూకే, అమెరికా వంటి దేశాల్లో 150 మందికి పైగా జేఎన్.1 వేరియంట్ బారిన పడ్డట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్ నుంచి పూర్తి రక్షణ ఇస్తాయో లేదో తెలీదని అంటున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని.. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చేతులు కడుక్కోవడం.. పిల్లలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సబ్బు, నీటితో చేతులు తరచూ కడుక్కోమని ప్రోత్సహించాలి.

అలాగే సామాజిక దూరం పాటించాలి. ఎక్కడికైనా వెళితే మాస్కులను ఖచ్చితంగా ధరించాలి. ముఖ్యంగా గుంపులుగా ఉండకుండా ఉండటం మంచిది. మీ పిల్లలను సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు కడగమని చెప్పాలి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం..ఇంట్లో వండిన ఆహారమే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు సమతుల్య ఆహారాన్ని పెడితే వారి మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే ఉదయాన్నే పిల్లల్ని కొద్దిసేపైనా వ్యాయామం చేయమని చెప్పాలి. వ్యాయామం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

అలాగే శరీరాన్ని ఫిట్ గా ఉంచి వారిని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. మాస్క్ ధరించడం..రద్దీగా లేదా బహిరంగ ప్రదేశాలాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ లను ఉపయోగించాలి. పిల్లల ముక్కు, నోటికి బాగా సరిపోయే మాస్క్ లు ధరించేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. అలాగే కలుషితం కాకుండా ఉండేందుకు మాస్క్ లు ధరించడం, తొలగించడం గురించి సరైన పద్ధతిని నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటించడం.. సామాజిక దూరం కూడా ముఖ్యమే. ఇతరుల నుంచి సురక్షితమైన దూరాన్ని పాటించడానికి పిల్లలను ప్రోత్సహించాలి.

ముఖ్యంగా పాఠశాల లేదా బహిరంగ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఈ సామాజిక దూరం ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోవాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. సరైన వెంటిలేషన్.. సరైన వెంటిలేషన్ ఉండే ప్రదేశాల్లో పిల్లలు చదువుకోవడం, ఆడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. బాగా వెలుతురు వచ్చే ప్రాంతాల్లో పిల్లలు సంక్రమణ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వీలైతే, ఇంటి లోపల వెంటిలేషన్ మెరుగుపరచడానికి కిటికీలు లేదా తలుపులను తెరిచే ఉంచండి.

వ్యాక్సినేషన్..కరోనాను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వ్యాక్సినేషన్. కరోనాపై జరుగుతున్న ఈ పోరాటంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. మీ పిల్లలను సురక్షితంగా ఉంచడానికి పిల్లలకు వ్యాక్సినేషన్కు సంబంధించిన అన్ని కొత్త మార్గదర్శకాల గురించి తెలియజేయండి. అలాగే ఇంట్లోని ప్రతి ఒక్కరూ పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకునేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker