Health

శృంగారంలో పాల్గొన‌డం ఒక్క‌సారిగా ఆపేస్తే అంత ప్ర‌మాదామా..?

శృంగారం మీకు శారీరక ఆనందాన్ని కలిగించడమే కాకుండా.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీ శరీరానికి ఆనందం కలిగినప్పుడు మనస్సు రిలాక్స్ అవుతుంది. లైంగిక కార్యకలాపాల వల్ల మనస్సుకు ఆనందం కలిగించే డోపామైన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. ఇది ఓదార్పు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శారీరక నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మరి సెక్స్ లో పాల్గొనడం మానేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం..!

ఆందోళన పెరుగుతుంది..ఆందోళ‌న‌ను త‌గ్గించ‌డంలో శృంగారం స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో ఒత్తిడి క‌లిగించే హార్మోన్ల‌ను ఇది నియంత్రిస్తుంది. కాబ‌ట్టి శృంగారంలో పాల్గొనేవారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అయితే శృంగారానికి దూర‌మైన‌ప్పుడు ఒత్తిడిని క‌లిగించే హార్మోన్ల స్థాయి అదుపు త‌ప్పుతుంది. త‌ద్వారా ఆందోళ‌న పెరుగుతుంది. గుండె పనితీరు తగ్గుతుంది..పరిశోధనల ప్రకారం.. వారంలో రెండు లేదా మూడు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో కన్నా.. నెలలో ఒకటి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయట.

ఇందుకు కారణం లేకపోలేదు.. సెక్స్ అనేది శరీరానికి వ్యాయామంలా పనిచేసి ఆందోళన, ఒత్తిడిలను తగ్గిస్తాయి. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.. గుండె బాగా పనిచేస్తుంది. జ్ణాపకశక్తి కూడా పెరుగుతుందట. వ్యాయామం తగ్గుతుంది..శృంగారం అనేది నిమిషానికి 5 కేలరీలను కరిగిస్తుంది. ఇది దాదాపు రోజూ వాకింగ్ చేసిన దాంతో సమానం. దీంతోపాటు శృంగారంలో పాల్గొనడం అనేది మెట్లు దిగడం, తోటలో పనిచేయడంతో సమానమైన వ్యాయామాలుగా సాయపడుతుంది. అందుకే శృంగారం అనేది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిచడంతో పాటు వ్యాయామంలా పనిచేస్తుందటారు.

కామక్రీడలు ఆపేస్తే వ్యాయామం తగ్గినట్టే కదా మరి. రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది..త‌ర‌చూ శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల క్రిముల‌తో పోరాడో ఇమ్యునోగ్లోబిన్ ఏ పెరుగుతుంది. అంటే రోగ నిరోధ‌క‌శ‌క్తి పెరుగుతుంది. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారి కంటే నెల‌లో ఒక‌టి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ఇమ్యూనిటీ త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. బంధాలు బ‌ల‌హీన‌మ‌వుతాయి..సెక్స్ అనేది మీ బ్రెయిన్ వాష్ చేసి.. మీ భాగస్వామితో మీరు ఎక్కువ కాలం కలిసి మెలిసి ఉండేలా చేస్తుంది. శృంగారం లేకుండా మీ వైవాహిక జీవితంలో సంతృప్తి కరువై.. బంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయి.

వారంలో కనీసం ఒకసారైనా శృంగారంలో పాల్గొనే జంటలు సుఖంగా.. సంతోషంగా జీవిస్తున్నారు. వీర్యగ్రంథి ఆరోగ్యం తగ్గుతుంది..నెలకు దాదాపు 20 రోజుల పాటు స్కలనం చేసే వారితో పోలిస్తే.. నెలకు ఏడు సార్లు కన్నా తక్కువ స్కలనం చేసిన పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్(వీర్య గ్రంథి క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ‌ని ఒక అధ్య‌య‌నంలో తేలింది. అలాగని అసురక్షిత, అనామక శృంగారం, బహుళ భాగస్వాములకు మొగ్గు చూపకండి. ఇది వీర్యగ్రంథి క్యాన్సర్‌ను మరింత పెంచుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిద్రలేమి..సెక్స్ చేయకపోతే ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహకరించే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుదల కావు.

మహిళల్లో నిద్రకు సహాయపడే ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే మీరు చాలా రోజుల తర్వాత మళ్లీ సెక్స్ చేయాలనుకుంటే.. ముందు రోజు రాత్రి మంచి నిద్ర అవసరం లేదంటే నీరసంగా ఉంటారు. నొప్పులతో బాధపడుతుంటారు..శృంగారం అనేది మీ మనసును రకరకాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. ఉద్వేగం మీ శరీరం తల, వెన్నుముక, కాళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడే ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ నొప్పి, నెలసరి సమయాల్లో వచ్చే తిమ్మిర్లు తగ్గించడానికి కూడా సహాయపడవచ్చు.

శృంగార సామర్థ్యం తగ్గుతుంది..శృంగారం చేయడం ఆపేస్తే స్త్రీలలో రుతుక్రమం ఆగి, యోని కణజాలం సన్నగా మారుతుంది. అంతేకాకుండా పొడిబారిపోతుంది. అది శృంగారం చేసే సమయంలో బాధ కలిగిస్తుంది. కోరికల్ని కూడా బలహీనపరుస్తుంది. ఇంకొన్ని పరిశోధనల ప్రకారం.. వారానికి ఒకసారి కంటే తక్కువ లైంగిక సంబంధం కలిగి ఉండే పురుషుల్లో అంగస్థంభన తక్కువగా ఉంటుందట. బీపీ పెరుగుతుంది..శృంగారం అనేది శరీరంలో బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. సెక్స్ అనేది వ్యాయామంలా మారి ఆందోళన తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది. ఫలితంగా బీపీ పెరగకుండా ఉంటుంది. సెక్స్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్‌గా బీపీ పెరుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker