News

చెల్లి నిశ్చితార్థంలో సాయిపల్లవి మాస్ డ్యాన్స్, వైరల్ అవుతున్న డాన్స్ వీడియో.

సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.ఈ క్రమంలోనే పూజ,వినీత్ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.ఈ వేడుకలో సాయి పల్లవి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు,స్నేహితులు హాజరయ్యారు.సాయి పల్లవి ఈ వేడుకలో తన స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సందడి చేసింది. అయితే తాజాగా సాయి పల్లవి మాస్ డ్యాన్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి షురు అయ్యింది. సాయి పల్లవికి పూజ కన్నన్ ఒక చెల్లెలు ఉంది.. అచ్చం ఆమె పోలికలతోనే ఉంటుంది. పూజ కన్నన్ కోలీవుడ్ ‘చిత్తిరై సెవ్వనం’ మూవీలో నటించింది. కెరీర్ పరంగా వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా పూజా కన్నన్ తన చిరకాల మిత్రుడు వినిత్ ప్రేమలో ఉంది. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇటీవల పూజ కన్నన్ తనకు కాబోయే భర్త వినిత్ అంటూ అభిమానులకు పరిచయం చేసింది.

ఈ క్రమంలోనే ఆదివారం పూజా కన్నన్, వినిత్ ల నిశ్చితార్థం వేడుకలు ఘనంగా జరిగింది. సాయి పల్లవి కన్నా పూజా కన్నన్ చిన్నదైనప్పటికీ.. అక్క కన్నా ముందుగానే పెళ్లి పీటలెక్కబోతుంది. ఇక ఆదివారం జరిగిన నిశ్చితార్థం వేడుకల అనంతరం సాయి పల్లవి తన కుటుంబ సభ్యులతో కలిసి డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేసింది. సాయి పల్లవి అంటే డ్యాన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటారు.. ఆమె డ్యాన్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker