గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్. ఇప్పుడు ఎలా ఉందంటే..?
శరణ్య చైల్డ్ ఆర్టిస్ట్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1997లో వచ్చిన ‘అనియతి పరవు’ మూవీతో మలయాళ ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, తమిళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. 2005లో వచ్చిన ‘ఒరు నాల్ ఒరు కనవు’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం.. అభినయంతో ప్రేక్షకులను అలరించిన తారలు .. ఆ తర్వాత పలు చిత్రాలు నటించి మెప్పించారు.
ఇక కొందరు హీరోయిన్స్ చాలా సినీపరిశ్రమకు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ మరికొందరు ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారిలో హీరోయిన్ శరణ్య మోహన్ ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసిన శరణ్య.. ఆ తర్వాత కథానాయికగా అలరించారు. 2005లో రిలీజ్ అయిన ఒరు నాల్ ఒరు కనవు సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఆమె.. ఆ తర్వాత తమిళంలో కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశారు.
కానీ 2009లో తెలుగులో వచ్చిన విలేజ్ లో వినాయకుడు సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత 2010లో న్యాచురల్ స్టార్ నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడమే కాదు.. భీమిలి సినిమా అంటే శరణ్య గుర్తుకు వస్తుంది. అమాయకత్వం, అందం కలబోసిన ఆమె నటన గుర్తొచ్చేస్తుంది. అంతగా ప్రేక్షకులకు చేరువయ్యింది శరణ్య. ఈ సినిమా తర్వాత కత్తి, మరో సినిమాలోనటించారు.
ఇక వరుసగా ఆఫర్స్ వస్తున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాకు దూరం అయ్యారు. ఈ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ..సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.