News

సలార్ నటికి యాక్సిడెంట్, ముఖం నిండా గాయాలతో ఎలా జరిగిందో చుడండి.

‘సలార్​’ సినిమాలో రెండు డైలాగులతో బాగా ఫేమస్ అయ్యారు పూజా విశ్వేశ్వర్. ‘రెండు నిమిషాలు బావా.. దొరసానిలా తయారుచేస్తా’ అని ఆమె చెప్పిన డైలాగ్​కు కౌంటర్​గా ప్రభాస్ మరో డైలాగ్ చెబుతారు. ‘రెండు నిమిషాలు.. దొరలా తయారుచేస్తా’ అని డార్లింగ్ చెప్పగానే థియేటర్​లో ఒకటే విజిల్స్. అయితే సలార్ సినిమా నటి పూజా విశ్వేశ్వర్‏కు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ముఖమంతా రక్తంతో నిండిపోయింది.

ఆమెను స్ట్రైచర్ పై అంబులెన్స్‏లోకి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. వీడియో చూస్తుంటే.. ఆమె కంటి భాగం దగ్గర పెద్ద గాయం జరిగినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని అనకాపల్లి హైవేపై వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆమె తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఆమెకు సలార్ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది పూజా విశ్వేశ్వర్. విశాఖపట్నంకు చెందిన పూజా… తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. గాడ్ ఫాదర్, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో కనిపించారు. కానీ సలార్ సినిమాతోనే పాపులర్ అయ్యారు.

సలార్ చిత్రంలోని ఓ ఫైట్ సీన్ లో.. చిన్నపిల్లపై విలన్ బలత్కారం చేయబోతే హీరో ప్రభాస్ వచ్చి కాపాడతాడు. మంచి బ్యా్గ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చే ఈ యాక్షన్ సీన్ సినిమాకు హైలెట్ అయ్యింది. అందులో విలన్ పక్కన కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుంది పూజా. “రెండు నిమిషాలు బావా.. దొరసానిలా తయారుచేస్తా” అని ఆమె చెప్పగానే..

“రెండు నిమిషాలు.. దొరలా తయారు చేస్తా” అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పడం హైలేట్ అయ్యింది. దీంతో పూజా మరింత ఫేమస్ అయ్యారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker