News

బిగ్ బాస్ బాగోతం బయట పెట్టిన స్టార్ యాంకర్, సాక్షాలతో సహా బయటపెట్టిన యాంకర్.

బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే కాస్తయినా తెలిసిన ముఖం అయి ఉండాలి. లేకుంటే ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ ఏముంటుంది. కాని ఈ విషయం తెలియక చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు.. చేస్తే చేశారు.. కాని ఈక్రమంలో వారు..ఎలాగైనా బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న ఆరాటంలో…. అందరిని నమ్మిమోసపోతుంటారు. అయితే వనితలో రేలార్ అనే టీవీ షోకి యాంకర్‌గా వ్యవహరించింది స్వప్న.

ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. అలాగే మిస్టర్.. నమస్తే సేట్ జీ అనే మూవీల్లో నటించింది. ఆమెకు కూడా బిగ్ బాస్‌కి వెళ్లాలని ఆశ. అయితే బీబీ హౌస్ లోకి పంపిస్తానని ఆ టీం సభ్యుల్లో ఒకరు తనను మోసం చేశారంటూ సాక్ష్యాధారాలతో సహా వీడియో ద్వారా బయట పెట్టింది. అందులో ఆమె ఏం చెప్పారంటే ‘బిగ్ బాస్‌కి వెళ్లడమంటే ఇష్టం. ఎంత ఇష్టమంటే.. నేను కనే కలలో కూడా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నట్లు కలగంటా.

బిగ్ బాస్ అన్ని సీజన్లు మిస్ అవ్వకుండా చూశా. బిగ్ బాస్ సీజన్ 7లో హౌస్‌లో‌కి నన్ను పంపిస్తాను అని చెప్పి తమ్మాలి రాజు రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. గత ఏడాది జూన్ నెలలో ఇచ్చాను’ అంటూ దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాగితాలను చూపించారు స్వప్న. ‘లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో‌కి వెళతావనే చెప్పారు. వేరో మార్గంలో నేను ట్రై చేసుకుంటా అంటే వద్దు నేనే పంపిస్తాను అని చెప్పి రాజు డబ్బులు అడిగారు.

ఎందుకు అని అడిగితే.. పీఆర్, రేటింగ్ పెంచుకోవడం, కాస్ట్యూమ్ కోసం అని చెప్పారు. డబ్బులు తీసుకోవడమే కాకుండా ఫోటో షూట్ కూడా చేశారు. దాని కోసం రూ. 25 వేలు ఖర్చు అయ్యింది. జూన్‌లో డబ్బులు ఇచ్చాను..కానీ బిగ్ బాస్ షోకి వెళ్లలేకపోయా.. అడిగితే.. బిగ్ బాస్ 8లో పంపిస్తాను అని చెప్పారు. అయితే ఓ అగ్రిమెంట్ రాసిచ్చారు. నేను పంపలేకపోయాను.. డిసెంబర్‌లో ఇస్తాను అని చెప్పారు.

బిగ్ బాస్ కోసం నేను చాలా మంది దగ్గర నుండి అప్పు చేసి ఇచ్చాను. నా పరిస్థితి బాగోలేదని చెప్పా. అయినా పంపిస్తాను.. వైల్డ్ కార్డు ద్వారా పంపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు’ అని పేర్కొంది. డిసెంబర్ 20వ తేదీలోగా డబ్బులు ఇస్తానని చెప్పాడు రాజు. ఆ తర్వాత జనవరి 6న ఇస్తానని చెప్పగా.. ఫోన్ చేస్తే.. ‘ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇస్తావా.. ఇచ్చుకో, ప్రెస్ మీట్ పెడతావా పెట్టుకో’ అంటూ సమాధానం చెప్పాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker