34 ఏళ్ల క్రితం సల్మాన్ రాసిన ప్రేమ లేఖ వైరల్, ఎలా ప్రపోజ్ చేశాడో చుడండి.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న లేఖలో సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’ విజయానికి సహకరించిన తన అభిమానులను ఉద్దేశించి రాసుకొచ్చాడు. సినిమా విడుదలైన నాలుగు నెలల తర్వాత ఆయన ఆ లేఖ రాసినట్లు సమాచారం. రివ్యూలకి పొంగిపోయిన సల్మాన్ తన కృతజ్ఞతలు తెలుపుతూ “నా గురించి మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా నన్ను అంగీకరించినందుకు, నా అభిమానులుగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పాలి. నేను మంచి పని చేస్తున్నాను. ఏకాగ్రతతో చేస్తున్నాను.
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్ అంటే సినిమా వాళ్లల్లో సల్మాన్ ఖాన్ తప్పించి ఎవరూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానలు ఉన్న సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసకుంటారా అని అడితే చాలు.. ఇప్పుడు కూడా అమ్మాయిలు క్యూ కడతారు. సల్మాన్ ఖాన్ అంటే ఇష్టపడని వారుఉండరు. . కాని ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా లైఫ్ నుఎంజాయ్ చేయడానికే టైమ్ కేటాయించారు. అంతే కాదు బాలీవుడ్ లో సల్మాన్ తో ఎంతో మంది హీరోయికు ఏఫైర్స్ నడిచాయి అన్నది అందరికి తెలిసిన నిజం.
స్టార్ హీరోయిన్లు.. అప్సరసల్లాంటి తారలతో నటించినా.. ఎవరినీ పెళ్లాడలేదు సల్మాన్. అయితే సల్మాన్ ఖాన్ జీవితంలో మాత్రం ఓ ప్రేమ లేఖ ఉందట. అదికూడా చాలా ఘాటుగా..మనసు పెట్టిరాశాడట. ఇంతకీ అది ఆయన ఎవరికి రాశారు. బాలీవుడ్ మీడియాలో సల్మాన్ రాసిన ప్రేమ లేక వైరల్ అవుతోంది. ఈ లేఖను సల్మాన్ స్వయంగా రాసినట్లు చెపుతున్నారు. 34 ఏళ్ల క్రితం రాసిన ఈ ప్రేమలేఖ.. సల్మాన్ ఖాన్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళ కోసం రాసినట్లు తెలుస్తోంది. అయితే 1989లో సల్మాన్ ఈ లేఖ రాశారు. ఈ లేఖలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావని ఆశిస్తున్నాను అని ఉంది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ లెటర్ తన ప్రియురాలి కోసం రాయలేదట సల్మాన్ ఖాన్. కాస్త వెరైటీగా ఉంటుందని అభిమానుల కోసం ఈ లేఖ రాశాడని తెలుస్తోంది. అయితే ఈ ఏఖకు సందర్భం ఏంటో తెలుసా..? సల్మాన్ ఖాన్ హీరోగా బ్లాక బస్టర్ హిట్ అయిన కల్ట్ క్లాసిక్ మూవీ మైనే ప్యార్ కియా. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సల్మాన్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అప్పుడే తన రొమాంటిక్ సెన్స్ ను ఏపయోగించి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యే పని చేశాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ తన అభిమానులకి లేఖ రాశారు.
29 డిసెంబర్ 1989 న విడుదలైంది మూవీ. సల్మాన్ నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ 1990లో రాశారు ఈ లేఖలో నన్ను అంగీకరించినందుకు, నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మొదటిగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఇక ముందు కూడా మంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను ఇకనుండి ఏ సినిమా చేసిన మైనే ప్యార్ కియా తో పోలుస్తారని నాకు తెలుసు కనుక మంచి సినిమా చేయాడానికి 100 శాంత ప్రయత్నిస్తాను అని రాశారు సల్మాన్ ఖాన్.