News

అప్పడు రూ.500 కోసం హోటల్ లో పని చేసిన అమ్మాయి, ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కోట్లు సంపాదిస్తుంది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టిన ఓ అమ్మాయి ఎలాంటి నేపథ్యంలో లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస విజయాలతో టాప్ పొజీషన్ కి చేరింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుండే ఒకరిపై అదరపడకూడదనే తత్త్వం అలవరుచుకుంది. అయితే మీరు చూస్తున్న పై ఫోటోలోని ఈ బ్యూటీ సౌతిండియా స్టార్ హీరోయిన్. ఒకప్పుడు వరుస‌ సినిమాల్లో నటిస్తూ స్టార్ బ్యూటీగా ఎదిగింది ఈ అమ్మడు.. తను ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వచ్చింది.

ఉన్నత చదువులు.. జీవితంలో స్థిరప‌డాలన్న ఆశయంతో అడుగులు వేసింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మధ్యలో ఆపేసింది ఈ ముద్దుగుమ్మ. కుటుంబానికి అండగా నిలిచినందుకు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఎంతోమంది చిన్నారులకు అండగా నిలుస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటుంది. సౌత్ స్టార్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీని ఏలుతోంది. ఇక తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకలు ఎదురయ్యాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోంటుంది.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుని దూసుకుపోతుంది. ఇంత‌కి ఈ చిన్నది ఎవరో ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా.. ఆమె మరెవరో కాదు మనందరికీ నచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. దేశంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న నటిగా రికార్డులను నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు..

కాలేజీ రోజుల్లోనే కేవలం రూ.500 కోసం ఓ హోటల్ నిర్వహించిన ఈవెంట్ కు హోస్ట్ గా పని చేసిందట. ప్రజెంట్ తాను నటించబోవు ఒక్కొక్క సినిమాకు నాలుగు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న సమంత తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టిందని టాక్. అయితే గతంలో మాత్రం కేవలం రూ.500 కోసం హోటల్లో హోస్ట్ గా పని చేసింద‌ని తెలిసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker