News

తను నా కుమార్తె కాదు, భర్తతో విడిపోయాను. హీరోయిన్ సుకన్య షాకింగ్ నిర్ణయం.

డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వం వహించిన పుదు నెల్లు పుదు నాథు సినిమాతో రంగప్రవేశం చేసిన సుకన్య.. ఆ తర్వాత కమల్ హాసన్, సత్యరాజ్, విజయ్ కాంత్ వంటి స్టార్ హీరోలతో నటించింది. విలక్షణ నటుడు జగపతి బాబు నటించిన పెద్దరికం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుకన్య.. ఇక్కడ అంతగా సినిమాల్లో నటించలేదు. ఎక్కువగా తమిళంలోనే ఆఫర్స్ రావడంతో అక్కడే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే నటి సుకన్య.. ఈతరం వారికి ఈమె పెద్దగా పరిచయం ఉండదు.

కానీ 1990 వారికి సుకన్య కలల రాణి. 1991లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పుదు నెల్లు పుదు నాత్తు’ అనే తమిళ చిత్రం ద్వారా సుకన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అసలు పేరు ఆర్తీ దేవి. అయితే సినిమాల కోసం సుకన్యగా.. దర్శకుడు భారతీరాజా ఆమె పేరు మార్చారు. చిన్న కౌంటర్, కొత్తవాసల్, సెంటమిల్ పటు, వాల్టర్ వెట్రివేల్, కరుపు వెల్లి, తాళతు, కెప్టెన్, వండిచోలై సిన్రాసు, మహానటి, మిస్టర్ మద్రాస్, మహాప్రభు, భారతీయుడు వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్‌ చేశారు. దక్షిణాది అన్ని భాషాల్లో మూవీలు చేశారు.

ఒకప్పుడు హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న సుకన్య.. ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యారు. తాజాగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి.. బుల్లితెర సీరియల్స్‌లో మాత్రమే కాక.. సినిమాల్లో తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకన్య.. తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. అలానే గత కొంతకాలంగా సుకన్య కూతురంటూ సోషల్ మీడియాలో ఒక యువతి ఫోటో వైరల్‌ అవుతుంది. పెళ్లి అయిన కొన్ని నెలలకే భర్తతో విడిపోయిన సుకన్యకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ ఆ ఫోటో మీద కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో దీనిపై స్పందిస్తూ.. ఆ యువతి తన కుమార్తె కాదని తెలిపారు సుకన్య. ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ..‘‘నేను కూడా ఆ ఫోటో చూశాను. తాను నా కూతురు కాదు, నా చెల్లెలి కుమార్తె. ఆ ఫోటోను నా ట్విట్టర్ పేజీలో షేర్ చేశాను. దానిలో నేను, నా సోదరి, తన బిడ్డ ఉన్నాము. ఆ ఫోటో చూసిన వారంతా.. తను నా కూతురు అంటూ ప్రచారం చేస్తున్నారు. తను నా కుమార్తె కాదు.. నా చెల్లెలు బిడ్డ. శ్రీధర్ రాజగోపాల్‌ని నేను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మేము కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నాము.

కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అవి మంజూరు కావడానికి చాలా కాలం పట్టింది. దాంతో ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నది నా కూతురే అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇక నా చెల్లెలు కూతురు ఈ వార్త చూసి.. పెద్దమ్మ వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చిందని ఇంట్లో వాళ్లతో చెబుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker