శరత్ బాబు చనిపోయాడు అని ప్రచారం చేసింది ఎవరో తెలుసా..?
తాజాగా శరత్ బాబు కన్నుమూశారని జరుగుతున్న ప్రచారంపై ఆయన సోదరి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి. శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యి, రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి అని పేర్కొన్నారు.
దీంతో శరత్ బాబు మరణం అనేది ఫేక్ న్యూస్ అని కన్ఫర్మ్ అయింది. అయితే ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల రావడం వైరల్ కావడం తెలిసిందే. బుధవారం మే మూడవ తారీకు సాయంత్రం ఆయన ఏకంగా చనిపోయినట్లు.. కొన్ని వెబ్ మీడియా… లలో స్టోరీలు వచ్చాయి వెంటనే శరత్ బాబు సోదరి వాటిలో వాస్తవం లేదని క్లారిటీ ఇవ్వటం జరిగింది.
అంతేకాదు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని త్వరలో మీడియాతో మాట్లాడగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మవద్దని ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్థించాలని ప్రజలను కోరడం జరిగింది. 71 సంవత్సరాల వయసున్న శరత్ బాబు హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
రైతులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊపిరితిత్తులు మరికొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందిన శరత్ బాబు.. పరిస్థితి విషమించడంతో అక్కడినుండి హైదరాబాద్ తరలించడం జరిగింది.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ క్రమంలో శరత్ బాబు ఆరోగ్యంపై రకరకాల ఫేక్ వార్తలు సృష్టించి వ్యూస్ కోసం పలు వెబ్ మీడియా చానల్స్… ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న.. తరుణంలో శరత్ బాబు సోదరి వచ్చి క్లారిటీ ఇవ్వటంతో ఆయన చనిపోయినట్లు వచ్చిన వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.