శర్వానంద్ పెళ్లి శుభలేఖ ఎలా ఉందొ చూసారా..?

మ్యారేజ్ వెన్యూ జైపూర్ లోని లీలా ప్యాలెస్‌కు చేరుకున్న.. శర్వా అండ్ రక్షిత కుంటుంబ సభ్యులు.. అక్కడే హల్దీ ఫంక్షన్లో హంగామా చేశారు. అందులో పెళ్లి కొడుకు.. మన స్టార్ హీరో శర్వా మాత్రం… అందరికి మీద హల్దీ చల్లుతూ.. ఎంజాయ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటికి వచ్చింది. అయితే టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన శర్వానంద్.. ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కేస్తున్నాడు.
ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ప్రకటన లేకుండా సడన్ గా నిశ్చితార్ధం చేసుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రక్షిత, శర్వాకి తోడు అవ్వబోతుంది. రక్షిత మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు మరియు హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు.

ఇక జనవరిలో నిశ్చితార్ధం చేసుకున్న శర్వా నెలలు గడుస్తున్నా పెళ్లి వార్త చెప్పడం లేదేంటని అందరూ ఎదురు చూపులు చూశారు. ఇక తాజాగా శర్వా పెళ్లి సంబరం ఘనంగా మొదలైపోయింది. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహం జరగబోతుంది. ఇక ఈ వివాహానికి సంబంధించిన పెళ్లి శుభలేఖ ఇప్పుడు బయటకి వచ్చింది. ప్రస్తుత ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జూన్ 2,3 ఈ వివాహ వేడుక జరగబోతుంది. ఈరోజు ఉదయం హల్దీ వేడుక జరగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ సాయంత్రం 5 గంటల నుంచి మెహందీ అండ్ కాక్‌టైల్ వేడుక జరగనుంది. రేపు ఉదయం 11:30 గంటలకు శర్వాని పెళ్లికొడుకు చేసే కార్యక్రమం ఘనంగా జరగనుంది.

ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక రేపు రాత్రి 11 గంటలకు శర్వా, రక్షితతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు. ఇక ఈ మ్యారేజ్ కి టాలీవుడ్ నుంచి సెలబ్రెటీస్ ఎవరెవరు హాజరవుతున్నారు అనే దాని పై టాలీవుడ్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకుంది.