Saves 67 Lives: అర్ధరాత్రి విలయం..! 67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క.. అసలు ఏం జరిగిందంటే..?

Saves 67 Lives: అర్ధరాత్రి విలయం..! 67 మంది ప్రాణాలు కాపాడిన కుక్క.. అసలు ఏం జరిగిందంటే..?
ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఎంతోమంది ప్రజలు ఇళ్లని, అయిన వారిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే జూన్ 30న అర్ధరాత్రి సియాతి గ్రామంపై కొండచరియ విరిగిపడింది. ఇది జరిగే కొద్ది నిమిషాల ముందు.. గ్రామంలోని నరేంద్ర అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్క అరవడం మొదలుపెట్టింది.

ఏం జరిగిందా..? అని నరేంద్ర కుక్క దగ్గరికి వెళ్లాడు. బయట జోరుగా వర్షం కురుస్తుండగా.. తన ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడి వర్షం నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించాడు. వెంటనే తన ఇంట్లోని వారందరినీ తీసుకుని బయటకు వెళ్లాడు. చుట్టపక్కల వారిని సైతం అలర్ట్ చేసి ఇళ్లకు దూరంగా తీసుకుని వెళ్లాడు. అలా వారు వెళ్లిన కాసేపటికే గ్రామంపై కొండచరియ విరిగిపడింది.
Also Read: : తాడు అనుకున్నారా..! తాడు అనుకున్నారా..!
దీంతో కుక్కే తమ ప్రాణాలను కాపాడిందని గ్రామస్థులు చెబుతున్నారు. కుక్క అరుపులతో ప్రాణాలతో బయటపడిన వారు.. ప్రస్తుతం త్రియంబల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించగా.. ఇతర గ్రామాల ప్రజలు సైతం ముందుకొచ్చి వారికి అండగా నిలిచారు.
Also Read: డైరెక్టర్ రాజమౌళి ఇంట తీవ్ర విషాదం
అయితే చాలా మంది గ్రామస్థులు రక్తపోటుతో బాధపడుతున్నారు. కాగా భారీ వర్షాలతో హిమాచల్ భారీగా నష్టపోయింది. కేంద్రం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మోడీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.