News

శుభవార్త చెప్పిన ABD, రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క.

డివిలియర్స్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేస్తుండగా కోహ్లీ గురించి ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలోనే డివిలియర్స్ ప్రపంచానికి ఈ శుభవార్తను తెలియజేశాడు. తాను కోహ్లీకి మెసేజ్ చేశానని, దీనిపై అతను స్పందించాడని.. కానీ ఎక్కువ సమాచారం ఇవ్వలేదని ఏబీ అన్నాడు. అయితే విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఏబీడీ ధ్రువీకరించాడు. భార్య గర్భవతిగా ఉన్నందుకే కోహ్లి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని పేర్కొన్నాడు.

అంతేతప్ప ఆటకు దూరమవ్వాలనే ఉద్దేశం రన్‌మెషీన్‌కు లేదంటూ కింగ్‌ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించాడు ఏబీడీ. మా అమ్మ బాగానే ఉన్నారు, కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి అందుబాటులో లేడు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన బీసీసీఐ.. హైదరాబాద్‌, వైజాగ్‌ టెస్టుల నుంచి కోహ్లి వైదొలిగినట్లు తెలిపింది. అయితే, ఇందుకు గల కారణం గురించి స్పష్టతనివ్వకపోవడంతో కోహ్లి కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చెందాయి.

గర్భవతి అయిన భార్య కోసం సమయం వెచ్చించేందుకు కోహ్లి బ్రేక్‌ తీసుకున్నాడని కొందరు.. తల్లి అనారోగ్యం వల్లే సెలవులో ఉన్నాడని ఇంకొందరు.. బీసీసీతో విభేదాల వల్లే ఇలా అని మరికొందరు నెట్టింట ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో విరాట్‌ సోదరుడు వికాస్‌ కోహ్లి.. తమ తల్లి సరోజ్‌ ఆరోగ్యం బాగానే ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లి రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని ఏబీ డివిలియర్స్‌ తాజాగా వెల్లడించాడు. అవును.. మళ్లీ తండ్రికాబోతున్నాడు:- కోహ్లి గురించి అభిమానులు కంగారు పడవద్దన్న ఏబీడీ.. ”తను బాగున్నాడు.

కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం ఇదేనని నేను అనుకుంటున్నా. కోహ్లి రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు తను కుటుంబంతో ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది విరాట్‌.. ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడని అనుకుంటారేమో. అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విరాట్‌ విషయంలో అసలు అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వొద్దు” అని స్పష్టం చేశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker