News

ఈ మలయాళీ అందానికి ఫిదా అయిన RGV, ఆ కళ్లలో ఎదో మ్యాజిక్ ఉందంటూ..?

ఇప్పుడు శ్రీలక్ష్మీ సతీష్ అంటే తెలుగు యువతకు ఇన్‌స్టంట్ క్రష్‌గా మారింది. ఎప్పుడూ పొట్టి బట్టల్లో చూసి విసిగెత్తిన నెటిజన్లకు చీరకట్టులోని అందాలను పరిచయం చేస్తోంది శ్రీలక్ష్మీ సతీష్. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మడి అందానికి దాసోహం అయ్యారు. సోషల్ మీడియాలో ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తూ.. తెగ పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్.. అయితే ఆమె పేరు ఆరాధ్యదేవి గా మార్చుకుంది.

సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా ఓ రోజు ఆర్జీవీ కంట పడింది. అంతే ఆమె ఎవరు.? ఆమె ఐడి తెలిస్తే చెప్పండి అంటూ నెటిజన్స్ ను రిక్వెస్ట్ చేశారు వర్మ. మొత్తానికి ఆమె ఐడి పట్టుకున్నారు. ఆమెను హీరోయిన్ గా ఒప్పించారు.ఆమెతో ఇప్పుడు శారీ అనే కూడా చేస్తున్నారు ఆర్జీవీ. ఇటీవలే ఈ నుంచి పోస్టర్ ను కూడా వదిలారు.

దాంతో ఈ అమ్మడు ఎవరు అంటూ చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఆరాధ్యదేవి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్జీవీ హీరోయిన్ అంటే మాములుగా ఉంటుంది.. ఆ చిన్నదాని అందం కుర్రకారును ఫిదా చేస్తుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కాకుండా చీరకట్టులో అంతకు మించి అందంగా ఉంది ఆ అమ్మడు. దాంతో ఆమె వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

ఆమె కూడా తన ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేయకుండా వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఓ వీడియోను పంచుకుంది.. అలా చీరకట్టులో వయ్యారాలు పోతూ.. కాటుకకళ్లను అటు ఇటూ ఇప్పుతూ.. అబ్బో .. మతిపోగొడుతోంది ఈ చిన్నది. ఈ వీడియోకు కుర్రాళ్ళు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker