News

ఆ స్టార్ క్రికెటర్ తో రెండో పెళ్లికి రెడీ అవుతున్న సానియా మీర్జా.

సానియా మీర్జా షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె చాలా విమర్శలను ఎదుర్కొంది. ఇద్దరూ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ నిర్ణయంపై కొందరు సానియాను ట్రోల్ చేశారు. కానీ అవేమీ లెక్క చేయకుండా షోయబ్‌ను సానియా పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక మొదట కొన్ని సంవత్సరాలు సంతోషంగానే గడిపారు. ఆతర్వాత వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పెళ్లయిన 10-12 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే ఇక షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత ఆ మధ్య సానియా మీర్జా ప్రముఖ క్రికెటర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు కొన్ని చోట్ల రూమర్స్ వచ్చాయి.

అంతేకాదు దీనికి సంబంధించిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె భారత క్రికెటర్ మహమ్మద్ షమీని సానియా పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. అయితే సర్క్యులేట్ అవుతున్న ఫోటో ఫేక్ అని ఆ తర్వాత తేలింది. ఇక సానియా మీర్జాతో పెళ్లి కాకముందే షోయబ్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ సంబంధం విడిపోయిన తర్వాత సానియా అతని భార్య అయింది. వీరి వివాహం 2010లో జరిగింది. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జాకు దూరంగా ఉంటున్న అత‌డు.. పాక్‌కు చెందిన న‌టి స‌నా జావెద్‌ ను వివాహం చేసుకున్నాడు.

షోయబ్ మాలిక్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రీడా ప్రపంచంలో క్యూట్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు ఒక పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. వీరి మధ్య అంతా బాగానే ఉందని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఒక సంవత్సర కాలంగా వారు వేరువేరుగా ఉంటున్నారు. గత కొద్ది నెలలుగా సానియా మీర్జా నుంచి షోయబ్ విడిపోయాడనే పుకార్లు కూడా షికారు చేశాయి. చివరికి ఆ పుకార్లే నిజమయ్యాయి.

ఇక వీరికి ఐదేళ్ల కొడుకు ఇజాన్‌ ఉన్నాడు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ క్రీడా ప్రపంచంలో అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010 ఏప్రిల్ 12న ఒక క్రాస్-కల్చరల్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. ఇక షోయబ్ మాలిక్ మూడో భార్య విషయానికి వస్తే.. సనా జావేద్, సౌదీ అరేబియాలోని జెడ్డాలో 1993 మార్చి 25న జన్మించింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker