News

రోజుల వ్యవధిలో భర్త, కొడుకును పోగొట్టుకున్న నటి కవిత, ఆమె కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.

కవిత 11 ఏళ్ల వయసులో వెండి తెరపై అడుగు పెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి సిరి సినిమా ద్వారా పరిచయం అయ్యింది. కవిత హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. సుమారు 350 సినిమాలు చేసింది కవిత. సినీ పరిశ్రమలో కవిత తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతిపై చిత్రపరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైన కవిత తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఆమె జీవితంలో జరిగిన విషాదాన్ని తలచుకుని ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ .. నా భర్త దశరధరాజ్ ఎదురుకట్నం ఇచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను హీరోయిన్ గా 60 రోజులు కష్టపడి సంపాదించిన డబ్బును ఆయన ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తాడు. అలా అని నా డబ్బు అస్సలు ముట్టుకోరు.

పెళ్ళికి ముందు నా భర్తకి నేను ఓ కండిషన్ పెట్టాను. నేను పిల్లల్ని కనను అని ముందే చెప్పాను. నేనేదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు. పెళ్లయ్యాక మా అత్తగారు త్వరగా పిల్లలను కనాలని ఇబ్బంది పెట్టేది. నాకు పిల్లలు వద్దమ్మా అని అమ్మతో చెప్పాను. ఎందుకని అడగ్గా .. పుడితేనే కదా చనిపోతారు అని అన్నాను. తమ్ముడు చనిపోయాక వాడి జ్ఞాపకాలతోనే బతికాను. అతడిని మర్చిపోలేక అలా మాట్లాడాను. అందరూ ఆ బాధ నుంచి బయటకు వచ్చేయమని చెప్పేవారు. కొన్ని నెలలకే నేను ప్రెగ్నెంట్ అయ్యాను.

రోజూ తమ్ముడి ఫోటో చూసి ఏడ్చేదాన్ని. అది గమనించిన నా భర్త నాకు మనసు రిలాక్స్ అవుతుంది అని నన్ను వరల్డ్ టూర్ కి తీసుకెళ్లారు. పాప పుట్టాకే నా జీవితం సంతోషమయం అయింది. మొత్తం నాకు ముగ్గురు పిల్లలు. కరోనా వల్ల నా భర్త, కొడుకు చనిపోయారని చెప్తూ కవిత ఎమోషనల్ అయ్యారు. 2021లో కవిత కొడుకు కోవిడ్ తో మరణించాడు. మరో రెండు వారాలకు ఆమె భర్త కూడా కన్నుమూశాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker