విలక్షణ నటుడు శరత్ బాబు మృతి పై క్లారిటీ ఇచ్చిన అయన సోదరి.

కొన్నాళ్ల కిందట అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. చెన్నైలో హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే మరోసారి అస్వస్థతకు గురి కావటంతో ఈ నెల 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది.
అయితే ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందాడంటూ వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తపై శరత్ బాబు సోదరి స్పష్టత ఇచ్చింది. శరత్ బాబు బతికే ఉన్నారని ఆయన మృతిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని ఆమె క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే శరత్ బాబు కోలుకుని అందరి ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శరత్‌బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు.

అయితే ఇతరత్రా అనారోగ్య సమస్యలు చోటుచేసుకోవడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లు సమాచారం.శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగు సినిమా చరిత్రలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందిన ఆయన తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో నటించారు.

మొత్తం 220 పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్ గా ను అనేక సినిమాలలో శరత్ బాబు విలక్షణ పాత్రలు పోషించారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో రామరాజ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు చాలా హిట్ సినిమాలలో నటించారు.