‘ఏజెంట్’ఫ్లాప్ తో డిప్రెషన్‌లోకి అఖిల్, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా..?

కరోనా విఘ్నాలను దాటుకుంటూ, హంగేరీ వరకు వెళ్లి మరీ షూటింగ్ చేసుకుని, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వాళ్లకి నీరసం తెప్పించి ఎట్టకేలకి నేడు విడుదలయ్యింది “ఏజెంట్”. ట్రైలర్ చూడగానే ఇన్నాళ్ల వెయిటింగ్ కి అర్ధముందనిపించేలా ఉంది. పెద్ద స్కేల్లో చాలా శ్రద్ధగా టార్గెట్ ఆడియన్స్ కి నచ్చేలా ఏదో తీసారనిపించింది.
అయితే ఏజెంట్ మూవీ అఖిల్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిస్తే..ఈ మూవీకి చేదు ఫలితం ఎదురుకావడంపై సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని, ఈ దోషం ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోవాలే తప్పా ఎవరి సలహాలు పాటించకూడదని వేణు స్వామి చెప్పాడు.

అయితే అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో డిజాస్టర్ అనిపించుకుంది.

అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్‌లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది.

దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్‌తో అఖిల్ కాస్త డిప్రెషన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్‌గా దుబాయ్‌కు వెకేషన్‌కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.