ఇండస్ట్రీలోకి రాకముందు సిరి హనుమంతు డబ్బులు కోసం ఏం చేసేదో తెలుసా..?
బిగ్ బాస్ తొలి నుండి ఫాలో అవుతున్న వాళ్లకి సిరి హన్మంత్ గురించి చెప్పనక్కర్లేదు. విశాఖ పట్నంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. కష్టాలను మెట్లుగా పేర్చుకుని సక్సెస్ అనే భవనంలోకి అడుగుపెట్టింది. తండ్రి చిన్నప్పుడే దూరం కావడంతో తల్లి ఆమెను, సోదరుడ్ని కష్టపడి పెంచింది.
అయితే సిరి హనుమంత్.. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించిది. సిరి ప్రముఖ యూట్యూబర్.. సోషల్ మీడియా ద్వారా ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇక ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి రాకముందు న్యూస్ రీడర్ గా చేసింది. విశాఖపట్టణానికి చెందిన సిరి. అక్కడ ఓ లోకల్ ఛానెల్ లో పనిచేసింది. ఆతర్వాత హైదరాబాద్ లో పలు టీవీ ఛానెల్స్ లో పని చేసింది.
అలాగే సీరియల్స్ లోనూ నటించింది సిరి హనుమంతు. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంది. పలు సినిమాల్లోనూ మెరిసింది ఈ భామ. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది సిరి హనుమంతు.