చిన్నవయసులోనే శృంగారంలో పాల్గొంటున్నారా..? మీకు వ్యాధులు వచ్చినట్టే..?

యుక్తవయసులో ఉన్నవారికి శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని.. వయసు పెరిగేకొద్ది ఆ కోరికలు క్రమంగా తగ్గిపోతాయని చాలా మంది భావిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలలో అయితే.. యుక్త వయసులో కన్నా.. మోనోపాజ్ దశలోనే ఎక్కువగా కోరికలు కలుగుతాయట.ఈ అంశంపై రెండు సంస్థలు సర్వే చేయగా.. ఆ రెండు సంస్థల రిజల్స్ ఒకేలా రావడం గమనార్హం.అయితే చాలామంది ఆ విషయంలో ఆగలేరు. కొందరికైతే యుక్త వయసు రాకముందే టీనేజ్ లోనే కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో ఏం చేయాలో తెలియదు. ఎలాగైనా శృంగారంలో పాల్గొనాలని తెగ తహతహలాడుతుంటారు.
టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు అయినా సరే.. అబ్బాయిలు అయినా సరే.. ఎవరికైనా టీనేజ్ లో శృంగార కోరికలు పెరిగితే మాత్రం అది వాళ్లకే నష్టం అట. భవిష్యత్తులో వాళ్లకు కొన్ని వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అబ్బాయిలు కానీ.. అమ్మాయిలు కానీ.. 15 ఏళ్లు నిండాయంటే చాలు.. ఇక వాళ్లకు కోరికలు పెరుగుతూనే ఉంటాయి. అది టీనేజ్. ఆ సమయంలో కొందరికి విపరీతంగా కోరికలు పుడుతుంటాయి. సినిమాల ప్రభావమో.. స్మార్ట్ ఫోన్ల ప్రభావమో కానీ.. అటువంటి వాళ్లు, యవ్వనంలో అప్పుడప్పుడే అడుగు పెడుతున్న వాళ్లకు కూడా శృంగార కోరికలు ఎక్కువ అవుతుంటాయి.
ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు. అవే ఆలోచనలు చేయడం.. ఎవరినైనా తమకు నచ్చిన వాళ్లను ఊహించుకోవడం చేస్తుంటారు. అందుకే.. పిల్లలు టీనేజ్ వయసుకు రాగానే.. ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ల మీద ఓ కన్ను వేసి ఉంచాలి. లేకపోతే పిల్లలకు లేని పోని సమస్యలు వస్తాయి.కొందరికి కోరికలు పుడితే.. మరికొందరు చిన్నారులపై లైంగికంగా వేధింపులు జరుగుతుంటాయి. అటువంటి వాళ్లకు కూడా భవిష్యత్తులో సమస్యలు తప్పవట. అబ్బాయిలు కానీ.. అమ్మాయిలు కానీ.. ఆ కోరికలు ఎక్కువ అయ్యేసరికి.. హస్తప్రయోగానికి అలవాటు పడతారు.
చిన్నతనం నుంచే హస్తప్రయోగానికి అలవాటు పడితే.. ఆ అలవాటును మానేయడం చాలా కష్టమట. దాని వల్ల భవిష్యత్తులో మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట. అబ్బాయిలకు చిన్నతనంలోనే ఎక్కువగా కోరికలు వస్తే.. శృంగారానికి అలవాటు పడితే.. వాళ్లలో హస్తప్రయోగం అలవాటు కూడా పెరుగుతుంది. దీంతో చిన్నప్పటి నుంచి హస్తప్రయోగానికి పిల్లలు అలవాటు పడిపోతారు. దాని వల్ల.. వాళ్లు పెద్దయ్యాక భావోద్వేగానికి గురవడం, మానసిక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. అదే అమ్మాయిలు చిన్నతనంలోనే శృంగారంలో పాల్గొంటే.. వాళ్లకు గర్భాశయం దగ్గర సర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.
చిన్నతనంలోనే సెక్స్ చేయడం వల్ల వాళ్లకు హెచ్పీవీ అనే వైరస్ సోకుతుందట. అది గర్భాశయం మీద ప్రభావం చూపించి.. సర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందట. ఒక సర్వే ప్రకారం.. చిన్న వయసులో ఉండే వాళ్లలో అబ్బాయిలు 66 శాతం మందికి కోరికలు ఎక్కువగా ఉంటాయట. అలాగే.. 66 శాతం మంది శృంగారంలో కూడా పాల్గొంటారట. అదే వయసులో ఉండే అమ్మాయిలలో 40 శాతం మంది మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నారట. ఏది ఏమైనా.. చిన్న వయసులోనే కోరికలు పెరగడం, తొందరపడి శృంగారంలో పాల్గొంటే జీవితాంతం ఆ సమస్యలతో సతమతమవ్వాల్సిందే.