జీవితంలో ఒక్కసారైనా నీలి రంగు అరటి పండు తినాలి. దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే..?

అరటి పండ్లల్లో కూడా చాలా రకాల రంగుల్లో వస్తున్నాయి.పసుపు పచ్చ రంగు అరటి పండ్లే ఉండేవి. కానీ ఇప్పుడు ఎరుపు, ఆకుపచ్చ,గులాబీ రంగు, ఊదారంగు వంటి రంగుల్లో అరటి పండ్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కానీ అరటి పండ్లలో నీలి రంగు అరటి పండ్లు మాత్రం చూడటానికే కాదు టేస్ట్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి.
ఈ నీలి నీలి ఆకాశం రంగుల్లో కనువిందు చేస్తున్నీ ఈ నీలిరంగు అరటి పండ్ల టేస్ట్ అచ్చంగా వెనీలా ఐస్ క్రీమ్ తినట్లే ఉంటోందంటున్నారు అరటి పండ్ల ప్రియులు. అయితే మన దేశంలో అరటి పండు పండక ముందు అంటే పక్వానికి రాకముందు, ఆకుపచ్చరంగులో ఉంటుంది, పండిన తరువాత పసుపు రంగులో ఉంటుంది అని మనందరికి తేలుసు.
అసలు నీలి రంగు అరటి అనే ఒక పండు ఉన్నది అని మీకు తేలుసా…. ఆ పండు వలన కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయి . వేరె దేశంలో నీలం రంగు అరటి పండ్లను తక్కువ ఉష్టోగ్రతలలో చల్లని ప్రాంతలలో ఎక్కువగా పండుతాయి , ప్రస్తుతం కోన్ని దేశాలలో ఆగ్నేయాసియా,టెక్సాస్, దక్షిణ అమెరికాలో అరటి పండిస్తున్నారు.
కాలిఫోర్నియా, ఫ్లోరిడా, లూసియానాలో అత్యధికంగా దిగుబడి ఉంటుందంట. ఫజిలో హవాయిన్ అరటి అని , ఫిలిఫ్పీన్స్లో క్రీ అని పిలుస్తారు .హవాయిలో నీలం రంగు అరటి పండ్లను ఐస్ క్రిమ్ అరటి అని… నీలం రంగు అరటి పండ్లలను బ్లూ జావా అని కూడా పిలుస్తారు. మరికోందరు నీలం రంగు అరటి పండ్లు గురించి సోషల్ మిడియాలో రాస్తున్నారు.
వారిలో కోందరు వెనీలా ఐస్ క్రీమ్ లాగా నీలం రంగు అరటి పండ్లను రుచి చూస్తారు అని చేపారు. దీనిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు, ఈ నీలం రంగు అరటి పండ్లను తినడం వలన ఐరన్ లోపాన్ని భర్తీ చేస్తుంది, మలబద్దకాన్ని తగ్గిస్తుందని, జీర్ణ వ్యవస్థతను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ నీలం రంగు అరటి పండు ఏంతో ఉపయోగపడుతుంది అని నీపునులు చేపుతున్నారు.