Health

షుగర్ ఉన్నవారు ఈ పండ్లు తింటే అంటే సంగతులు. పొరపాటున తిన్నాకూడా..?

డయాబెటిస్ ఉందని నిర్ధారణ అయినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాం. నిజానికి మీ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలని శరీరం సంకేతం ఇస్తుందని మాత్రమే అర్థం చేసుకుంటే మీకు టెన్షనే ఉండదు. ఎందుకంటే మీరు సరైన రీతిలో జీవన శైలి మార్చుకుంటే డయాబెటిస్ భయం పోవడమే కాకుండా, ఇతర వ్యాధులూ మీ చుట్టుముట్టవు. అయితే షుగర్ వ్యాధి వచ్చాక జాగ్రత్త పడటం కన్నా.. రాకముందే షుగర్ ను కంట్రోల్ లో పెట్టుకుంటే బెటర్. కానీ… ఎవ్వరైనా షుగర్ రాకముందు తమ ఆహార అలవాట్లను మార్చుకోరు. షుగర్ వచ్చాక మాత్రమే ఆహార అలవాట్లను మార్చుకుంటారు.

ఒక సింపుల్ ఫార్ములా… షుగర్ రాకుండా ఉండాలంటే… జీవితంలో షుగర్ ట్యాబ్లెట్టే వేసుకోకుండా ఉండాలంటే ఒక్కటే చేయాల్సింది… ప్రతి రోజు తినే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలు.. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం.. ఇదే మీరు చేయాల్సిన పని. ఇలాంటి ఫుడ్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే కనుక జీవితంలో షుగర్ మీ ముఖం కూడా చూడదు. ఇక కర్మకాలి షుగర్ వచ్చిందనుకో. మీరు చేసేదేం లేదు. మీ ఆహార అలవాట్లను ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. షుగర్ వచ్చాక షుగర్ ను కంట్రోల్ ఎలా చేయాలో తెలుసుకోవాలి.

అంటే ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది చాలా ఇంపార్టెంట్. షుగర్ వచ్చాక చాలామంది చేసే తప్పు ఒక్కటే. పండ్లను తినకపోవడం. నిజమే షుగర్ వస్తే కొన్ని రకాల పండ్లను తినకూడదు కానీ.. అన్ని పండ్లను తినకూడదు అనేది ఎక్కడా లేదు. షుగర్ వచ్చిన వాళ్లు పండ్లను తినొచ్చు కానీ.. కొన్ని రకాల పండ్లను మాత్రం అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకొని వాటికి దూరంగా ఉంటే చాలు… మిగితా పండ్లను హ్యాపీగా తినేయొచ్చు.

సీజనల్ ఫ్రూట్స్ ను పక్కన పెడితే చాలు… షుగర్ వచ్చినవాళ్లు సీజనల్ గా దొరికే మామిడి పండ్లు, సపోట పండ్లు, సీతాఫలం పండ్లను మాత్రం అస్సలు తినకూడదు. వాటిలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలాగే ఖర్జూరాలను కూడా తినకూడదు. ఇక… అసలైనది అరటి పండు. షుగర్ ఉన్నవాళ్లు ఈ పండును అస్సలు ముట్టుకోకూడదు. ఒకవేళ మీకు షుగర్ కంట్రోల్ అయ్యాక… ఇక ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఆపితే.. అప్పుడు ఈ పండ్లను తినొచ్చు.

కానీ…. షుగర్ కంట్రోల్ కోసం ట్యాబ్లెట్లు వాడుతుంటే మాత్రం ఈ పండ్లను అస్సలు తినకండి. ఈ పండ్లు కాకుండా… మిగితా పండ్లు ఏవైనా షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ, పొప్పడి కాయ, తర్భూజ, బత్తాయి, నారింజ, ఆపిల్, స్ట్రాబెర్రీ, కివీ ఫ్రూట్… ఇలా మార్కెట్ లో దొరికే ఏ పండ్లనైనా తినొచ్చు. అందుకే… షుగర్ వస్తే… ఏ పండ్లు తినకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. అందుకే మీకు షుగర్ ఉన్నా… ఏం చక్కా ఈ పండ్లను తినేయొచ్చు. కాకపోతే పైన చెప్పిన ఆ ఐదు రకాల పండ్లకు మాత్రం దూరంగా ఉండండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker