Health

ప్రాణాయామం చేసేముందు తప్పకతెల్సుకోవాల్సిన విషయాలు. శారీరకంగా కూడా..?

ఆధునిక కాలంలో నిత్యం భరించలేని ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా, మీ గుండెపై భారం తగ్గించాలన్నా ప్రాణామయం చేయడం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన దేశం భారతదేశం కనుక ఇలాంటి ప్రాచీన విద్య మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాణాయామం క్రమం తప్పకుండా చేసేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. వీరిలో ఏకాగ్రత సైతం పెరుగుతుందని పలు అధ్యయనాలలో తేలింది. అయితే యోగా గురించి ప్రస్తుత జనరేషన్ కు బాగానే తెలుసు. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు.. శారీరకంగా ఫిట్ గా ఉండొచ్చు.

కానీ.. ప్రస్తుత జనరేషన్ జీవన విధానం డిఫరెంట్. ఈ జనరేషన్ జీవన శైలి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల రకాల రోగాలు, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు.. ఇలా పలు రకాల రోగాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వీటి నుంచి బయటపడే మార్గం తెలియక.. జనాలు సతమతమవుతున్నారు. కానీ.. మన భారతదేశ ప్రాచీన విధానం అయిన యోగాను నమ్ముకుంటే.. ఇటువంటి రోగాలకు చెక్ పెట్టొచ్చని ఎంతమందికి తెలుసు.

అసలు.. ఈ జనరేషన్ కు యోగా గురించి తెలుసు కానీ.. యోగా చేయడం మాత్రం చాలామందికి తెలియదు. కనీసం ఒక్కటంటే ఒక్క యోగాసనం వేయడం కూడా తెలియని వాళ్లు కోకొల్లలు. ప్రస్తుత జనరేషన్ జీవన విధానం వల్ల వచ్చే పలు వ్యాధులను అరికట్టాలంటే.. యోగా అనేది బెస్ట్. యోగా చేయడం ఎలాగో నేర్చుకొని.. అవసరమైన కొన్ని యోగాసనాలు వేసినా చాలు.. జీవితంలో ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ యోగాసనాలు బెటర్.. యోగాలో చాలా ఆసనాలు ఉన్నా… ప్రాణాయామం అనే ఆసనాన్ని నేర్చుకొని రోజూ ప్రాక్టీస్ చేసినా.. ఎన్నో రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు.

రాకుండా నివారించుకోవచ్చు. ప్రాణాయామాన్నే మెడి బ్రీతింగ్ అని కూడా అంటారు. అలాగే మనసును కూడా ప్రశాంతంగా ఈ ఆసనం ద్వారా ఉంచుకోవచ్చు. ప్రాణాయామాన్ని ఎలా చేయాలంటే… ముందుగా ప్రశాంతంగా కూర్చొని.. చేతులు చాచి.. మోకాళ్ల దగ్గర ఆనించి.. నిటారుగా కూర్చొని.. రెండు ముక్కు రంధ్రాల నుంచి గాలిని వదలాలి. తర్వాత కుడి చేయి బొటన వేలుతో ముక్కు కుడి వైపు రంధ్రాన్ని మూసేయాలి. అప్పుడు ముక్కు ఎడమ రంధ్రం నుంచి గాలిని పీల్చుకోవాలి. అలా గాలి పీల్చుతూ ఉన్నప్పుడు తలను నెమ్మదిగా పైకి ఎత్తాలి.

గాలిని పీల్చిన తర్వాత కొంచెం సేపు అలాగే ఉండి.. నెమ్మదిగా… అదే ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలిని వదులుతూ ఉండాలి. అలా.. ఓ పది పదిహేను సార్లు అలా చేయాలి. ఆ తర్వాత కుడి చేయి మధ్య వేలుతో ముక్కు ఎడమ రంధ్రాన్ని మూసేసి.. కుడి రంధ్రం నుంచి గాలిని పీల్చాలి. తర్వాత కాసేపు అలాగే ఉండి గాలిని నెమ్మదిగా బయటికి వదలాలి. అలా ఓ పది పదిహేను సార్లు చేస్తే చాలు. ఇలా రోజూ ఉదయమే ఒక పది నిమిషాలు ప్రాణాయామం చేస్తే.. మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరడంతో పాటు.. కొన్ని రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker