News

శోభన్ బాబు మళ్లీ పుట్టాడా..? ఎవరీ అందగాడు..? ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ సిల్వర్ స్క్రీన్ ని ఏలుతున్న రోజుల్లో శోభన్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆరడుగుల ఆహార్యం, చక్కని రూపంతో శోభన్ బాబు వంద శాతం హీరో మెటీరియల్. 1959లో విడుదలైన దైవ బలం మూవీతో హీరో అయ్యాడు. తనకంటూ ఒక జోనర్, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. అందుకే శోభన్ బాబు ఎక్కువగా ఆ తరహా పాత్రలు చేశారు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడుగా అనేక సినిమాలు చేశాడు. అయితే తాజాగా ఇప్పుడు దివంగత హీరో శోభన్ బాబు ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. ఆంధ్రుల అందగాడు..తెలుగు ప్రేక్షకుల సోగ్గాడు దివంగత హీరో శోభన్ బాబుకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆర్టిఫీషియల్ టెక్నాలజీ సాయంతో ఈ వీడియోను రూపొందించినట్లుగా చూస్తుంటే అర్థమవుతుంది. సముద్రం ఒడ్డున శోభన్ బాబు చాలా స్టైలీష్‏గా.. రాయల్ గా నడుస్తూ వస్తున్నట్లుగా కనిపిస్తుంది.

అందులో శోభన్ బాబు కటౌట్ హాలీవుడ్ రేంజ్‏లో కనిపిస్తుండగా.. ఏఐ టెక్నాలజీ సాయంతో శోభన్ బాబు ముఖాన్ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. సోగ్గాడు మళ్లీ ఇన్ స్టా యుగంలో జన్మిస్తే ఇలా ఉంటాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. శోభన్ బాబుకు తెలుగులో ఒకప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker