News

సినిమా చూడాలంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహెల్, వైరల్ అవుతున్న వీడియో.

బిగ్‍బాస్‍లో ఉన్నప్పుడు వేల కామెంట్లు పెట్టారు కదా.. ఎప్పుడేమైంది అని నెటిజన్లను సోహెల్ ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమా (బూట్‍కట్ బాలరాజు) తీసుకొచ్చినా.. ఆదరణ దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సోహెల్.. తాజాగా నటించిన చిత్రం “బూట్ కట్ బాలరాజు”.. ఫిబ్రవరి 2న థియేటర్ లలో విడుదల అయింది. డైరెక్టర్ శ్రీ కోనేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా సయ్యద్ సోహెల్, మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం ఇలా కొంతమంది ప్రముఖ నటి నటులు ముఖ్య పాత్ర పోషించారు.

ఈ క్రమంలో విడుదలకు ముందు చిత్ర బృందం ఈ చిత్రానికి భారీగానే ప్రమోషన్లు చేశారు. ఆ సమయంలో యాంకర్ సుమ కూడా తన సినిమా ఈవెంట్ ను.. డబ్బులు తీసుకోకుండా ఫ్రీ గానే చేశారని.. ఆమె గొప్పతనం గురించి కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలానే తానూ సినిమా విడుదల చేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని కూడా.. డొనేట్ చేసేస్తానని కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన సోహెల్. తాజాగా సినిమా విడుదల అయిన తర్వాత.. భావోద్వేగంతో మాట్లాడిన పలు వ్యాఖ్యలు ఇప్పడు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

“నా సినిమాకు వెళ్ళండి, ఇప్పుడు థియేటర్స్ కు ఎందుకు వెళ్లడం లేదు? ఏమైంది?. బిగ్ బాస్ లో ఉన్నపుడు వేల కామెంట్స్ పెట్టారు కదా సోహెల్ సోహెల్ అని .. ఇప్పుడెందుకు ఎంకరేజ్ చేయడంలేదు? ” అంటూ సోహెల్ భావోద్వేగంతో అందరిని ప్రశ్నించాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కాగా “బూట్ కట్ బాలరాజు” కథ విషయానికొస్తే.. హీరో తన గ్రామంలో ఏమి లేని ఓ వ్యక్తి. అందరి బాగోగులను చూసే ఊరి పెద్ద కూతురు.. హీరోకు మంచి స్నేహితురాలు. ఈ క్రమంలో మరో హీరోయిన్ కు, ఆ ఊరి పెద్ద కూతురు.. హీరో మీద ఉన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు, హీరో తన చిన్ననాటి స్నేహితురాలిని మాత్రమే అంగీకరిస్తాడు.

దాని వెనుక గల కారణాలు ఏమిటి? తర్వాత ఏం జరుగుతుంది? హీరో ఎదుర్కోవాల్సిన సవాలు ఏమిటి? అనేదే సినిమా కథ. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పి తీరాలి. ఇక రాబోయే రోజుల్లో టాక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ క్రమంలో సోహెల్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో అందరికి హాట్ టాపిక్ గా మారాయి. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker