Sonu Sood: ఇంట్లోకి వచ్చిన పామును పామును చేత్తో పట్టుకున్న సోనూసూద్, వైరల్ వీడియో.

Sonu Sood: ఇంట్లోకి వచ్చిన పామును పామును చేత్తో పట్టుకున్న సోనూసూద్, వైరల్ వీడియో.
Sonu Sood: కరోనా క్లిష్ట కాలంలో ఈ నటుడు సేవలు, సహాయక కార్యక్రమాలు, దాన ధర్మాలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఇప్పటికీ సోనూ సేద్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సోనూసూద్. అయితే పామును చూసి ఎవరైనా పారిపోతారు.

అయితే ‘రియల్ హీరో’, సినీ నటుడు సోనూ సూద్ మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నారు. ఆ పాముని చూసి అక్కడి సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే, సోనూసూద్ మాత్రం చాకచక్యంగా ఆ పామును పట్టుకొని..అడవిలో విడిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ముంబయిలో సోనూసూద్ నివాసం ఉండే సొసైటీలోకి ఓ పాము దారితప్పి వచ్చింది.
Also Read: కోట శ్రీనివాసరావు ఆస్తులు విలువ తెలుసా..?
పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు. సోనూ సూద్ మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని ఓ సంచిలో బంధించాడు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా, ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలని సూచించారు.
Also Read: ఆ స్టార్ హీరోయిన్ క్రైస్తవ మత ప్రచారకురాలిగా మరి ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..?
తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని సోనూసూద్ స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
हर हर महादेव 🔱❤️#harharmahadev🙏🌿🕉️ pic.twitter.com/u500AcrlxS
— sonu sood (@SonuSood) July 19, 2025