Health

అందంగా కనిపించడం కోసం శ్రీదేవి చేసిన డైట్ అంత ప్రమాదకరమా..? మరణానికి కారణం కూడా అదేనా..?

శ్రీదేవి మరణంపై చాలా ఏళ్ల తర్వాత మౌనం వీడారు ఆమె భర్త బోనీ కపూర్‌. ఈ ఘటనకు సంబంధించి తనను చాలా కాలంగా విచారణను ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు . అలాగే శ్రీదేవి మృతికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ‘ది న్యూ ఇండియన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘శ్రీదేవి మరణం సహజమైనది కాదు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది. విచారణలో నేను 48 గంటల పాటు మాట్లాడాను. అందుకే ఇక మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. భారతీయ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉన్నందున వారిని ఈ విధంగా విచారించాలని అక్కడి అధికారులు నాకు చెప్పారు.

అయితే అందాల తార శ్రీదేవి 2018లో దుబాయిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె, సడెన్ గా ఎందుకు చనిపోయిందో అర్థం కాలేదు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిందని చెప్పారు. ఆమె మరణం విషయంలో బోనీ కపూర్ పై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే,ఆమె మరణానికి కారణాన్ని రీసెంట్ గా బోనీ కపూర్ తెలియజేశారు., శ్రీదేవిది సహజ మరణం కాదని, ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణం అని తెలిపారు. అయితే ఈ సందర్భంగా శ్రీదేవికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టారు. అందంగా కనిపించడం కోసం ఆమె కఠినమైన డైట్‌ని ఫాలో అయ్యేదట. పెళ్లి తర్వాత ఆ విషయం తనకు తెలిసిందని బోనీ కపూర్‌ తెలిపారు.

ఆమె ఉప్పు లేకుండా భోజనం చేసేదట. దీని కారణంగా చాలాసార్లు ఆమె నీరసించిపోయేదని వెల్లడించారు. అంతేకాదు లో బీపీ సమస్య తలెత్తేదని, చాలా సార్లు ఆమె కళ్లు తిరిగేదని ఆయన వెల్లడించారు.అయితే ఈ విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా తను సీరియస్‌గా తీసుకోలేదని, శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని చెప్పారు. నిజంగానే, ఉప్పులేకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..మనిషి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం ఆధారంగా మనిషి శరీరానికి సోడియం చాలా అవసరం. ఉప్పు తక్కువగా తీసుకోవచ్చు.

కానీ, అసలు ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం కరెక్ట్ కాదు అని నిపుణులు చెబుతున్నారు. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమైన ప్రధాన ఖనిజాల్లో ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తోంది. ఒకవేళ సరిపడ ఉప్పును ఆహారంలో తీసుకోకపోతే, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవ్వదు. ఫలితంగా తరచూ కళ్లు తిరుగుతూ ఉంటాయి. లోబీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, శరీరానికి సరపడా సోడియం అందనట్లయితే, నీరు చేరి ఉబ్బినట్లుగా అయిపోతుంటారు. ఒక మనిషి శరీరంలో ఉండాల్సిన సోడియం సాధారణంగా పర్ లీటర్ కి 135 మిల్లిక్వివలెంట్స్ కంటే తక్కువగా ఉంటే దానిని హైపోనాట్రేమియా అంటారు.

దీంతో కండరాలు, కణాలు ఉబ్బిపోతాయి. ఇక, రోజుకు కేవలం 2.4 గ్రాముల కంటే ఉప్పు తక్కువ తీసుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తరచూ తలనొప్పి, అలసట, మైకం, కళ్లు తిరగడం వంటి సమస్య ఏర్పడుతుంది. బీపీ ఉన్నవారు ఉప్పు తక్కువగా తింటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ, బీపీ, షుగర్ లాంటి ఏ సమస్యలు లేకున్నా, ఉప్పు తక్కువగా తినడం సమస్యలకు కారణమౌతుంది. ప్రతిరోజూ 5 గ్రాముల ఉప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, అందం కోసం ఉప్పు ని పూర్తిగా మానేయడం కంటే, ఆరోగ్యంగా ఉండేదుకు సరిపడా ఉప్పు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker